వారికే చోటు
close
Published : 22/07/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారికే చోటు

పూర్వం ఒక వ్యక్తి ప్రాణాన్ని మృత్యుదూత తీసుకెళ్లాడు. అల్లాహ్‌ అతనికి స్వర్గప్రాప్తినిచ్చారు. దైవదూతలు అతణ్ని ‘ప్రపంచంలో నువ్వేం చేశావు?’ అనడిగారు. ‘నేను గొప్ప ధనవంతుణ్ని. అడిగిన వారికి లేదనకుండా అప్పులు ఇచ్చేవాణ్ని. స్థోమత లేని వారికి గడువు పెంచేవాణ్ని. కొందరికి ఇచ్చిన రుణాన్ని తగ్గించేవాణ్ని. మరీ పేదలైతే అప్పును పూర్తిగా మాఫీ చేసేవాణ్ని. ఇదంతా అల్లాహ్‌కు నచ్చింది. అందుకే నాకు స్వర్గప్రాప్తి కలిగింది’ అన్నాడతను. మహాప్రవక్త ముహమ్మద్‌ (స) చెప్పిన ఈ గాథలో చక్కటి పాఠముంది. రుణగ్రహీతలకు గడువు పెంచడం, లేదా అప్పును మాఫీ చేయడం లాంటి మంచి పనులు చేసిన వారికి అల్లాహ్‌ ప్రళయం రోజున తన సింహాసనం నీడలో చోటు కల్పిస్తారు. ప్రళయ దినాన పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ఆ రోజు సూర్యుడు నడి నెత్తిమీదకు వస్తాడు. తిరస్కారులు, దుర్మార్గులంతా పీకల్లోతు చెమటలో మునిగి ఉంటారు. దైవాదేశాలను పాటించిన వారికి ఎలాంటి దుఃఖమూ కలగదు.  ఏ భయాందోళనలూ దరిచేరవు. ‘మీ బాకీదారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, అతని పరిస్థితి మెరుగుపడే వరకూ గడువు ఇవ్వండి. తెలిసినవారే అయితే, ఆ బాకీని దానం చెయ్యండి. అది మీకెంతో మంచిది. అల్లాహ్‌ వద్దకు మీరు వెళ్లేరోజున జరిగే పరాభవం, కలిగే ఆపదల నుంచి రక్షించుకోండి’ అంటుంది దివ్య ఖురాన్‌. అలాగే ఒక్క పైసా కూడా చెల్లించే ఉద్దేశం లేకుండా, వికృత బుద్ధితో అప్పు తీసుకోవడం కూడా ఘోర పాపమని ప్రవక్త (స) హెచ్చరించారు. 

- ముహమ్మద్‌ ముజాహిద్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని