TS News: వ్యర్థాలతో 100 మెగావాట్ల విద్యుత్తు!
close
Published : 30/07/2021 23:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: వ్యర్థాలతో 100 మెగావాట్ల విద్యుత్తు!

ఈనాడు, హైదరాబాద్‌: హరితహారంతో పచ్చందాలను పరచుకుంటున్న భాగ్యనగరం.. పర్యావరణానికి మేలు చేసేలా మరో మైలురాయికి చేరువ అవుతోంది. నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను భస్మం చేసి.. 100మెగావాట్లకుపైగా విద్యుదుత్పత్తిని సాకారం చేసే కేంద్రాలకు నిలయంగా మారుతోంది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటికే జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డులో 20మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంటు సేవలు అందిస్తోంది. అదే తరహాలో చెత్తను మండించి విద్యుత్తును ఉత్పత్తి చేసే మరో ఐదు కేంద్రాలు రాబోయే రెండేళ్లలో అందుబాటులోకి రాబోతున్నాయి. అప్పుడు.. నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలు దాదాపు పూర్తిస్థాయిలో భస్మం అవుతాయి.

రోజూ 6వేల టన్నులకుపైగా..

గ్రేటర్‌ పరిధిలో ప్రస్తుతం రోజుకు 6వేల టన్నులకుపైగా చెత్త ఉత్పత్తి అవుతోంది. రాబోయే ఐదేళ్లలో అది మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నగరంలో ఉత్పత్తయ్యే చెత్తంతా ప్రస్తుతం శామీర్‌పేట మార్గంలోని జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డుకు వెళ్తోంది. అక్కడ ఇప్పటికే 20మెగావాట్ల సామర్థ్యం గల విద్యుదుత్పత్తి కేంద్రం సేవలు మొదలయ్యాయి. అందులో ఉత్పత్తయ్యే కరెంటు పక్కనున్న మల్కారం విద్యుత్తు ఉపకేంద్రం ద్వారా ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థ గ్రిడ్‌కు సరఫరా అవుతోంది. ఫలితాలు బాగుండటంతో డంపింగ్‌యార్డులోనే సర్కారు 28మెగావాట్ల సామర్థ్యం గల మరో విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. డంపింగ్‌యార్డులోని వ్యర్థాల నిర్వహణతోపాటు విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్వహణ పనులనూ రాంకీ ఎన్విరో సంస్థ ఆధ్వర్యంలో ఉంటాయి.

త్వరలో దుండిగల్‌లో..

రెండేళ్ల క్రితం దుండిగల్‌లో మొదలైన ప్లాంటు నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. తాగునీటి పైపులైన్లు, రోడ్డు, ఇతరత్రా పనులు జరగాల్సి ఉంది. ఆరు నెలల్లో సేవలు అందుబాటులోకి వస్తాయని రాంకీ అధికారులు చెబుతున్నారు. 

ఎనిమిది నెలల్లో యాచారం ప్లాంటు..

ఇబ్రహీంపట్నం సమీపంలోని యాచారంలో శ్రీ వెంకటేశ్వర సంస్థ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. జపాన్‌ సాంకేతికతతో పని చేసే యంత్రాలను దిగుమతి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఇప్పటికే ఈ రంగంలో పాతుకుపోయిన ఓ ప్రైవేటు సంస్థ వెంకటేశ్వర ఏజెన్సీ ప్లాంటుకు అడ్డంకులు సృష్టిస్తోంది. తమ ప్లాంటులో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా 14మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలమని, తమకున్న పరిమితిని 11 నుంచి 14మెగావాట్లకు పెంచాలని సర్కారుకు రాసిన లేఖపై అపోహలు సృష్టిస్తోందని విమర్శిస్తోంది. సర్కారు మాత్రం వ్యర్థాల నిర్వహణ రంగంలో కొత్త సంస్థలకు, నూతన సాంకేతికతలకు అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా 8నెలల్లో యాచారం విద్యుదుత్పత్తి కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చేలా యాజమాన్యం లక్ష్యం పెట్టుకుంది. నర్సాపూర్‌ హైవేలోని ప్యారానగర్‌లో 150 ఎకరాల్లో మరో 20 మెగావాట్ల ప్లాంటును నెలకొల్పేందుకు ప్రైవేటు సంస్థ తాజాగా సర్కారుకు ప్రతిపాదనలు సమర్పించింది.

విద్యుదుత్పత్తి కేంద్రాల వివరాలు ఇలా..

కేంద్రం            విద్యుదుత్పత్తి       రోజూ బూడిదయ్యే 
సామర్థ్యం        వ్యర్థాలు(టన్నుల్లో)      (మెగావాట్లలో)   
జవహర్‌నగర్‌-1       20                  1100-1300
జవహర్‌నగర్‌-2       28                  1500   
దుండిగల్‌            15                900-1000
యాచారం           14                    700
బీబీనగర్‌            12                      1100
ప్యారానగర్‌         20                1200-1300
మొత్తం             109                 6500-6900 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని