చేతులు.. నోరు కట్టేసి దాడి
close
Published : 31/07/2021 07:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేతులు.. నోరు కట్టేసి దాడి

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై ఆంగతకుల చర్య

శేరిలింగంపల్లి, న్యూస్‌టుడే: ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ని తీవ్రంగా కొట్టి నోట్లో వస్త్రాలు కుక్కి చేతులు కట్టేసి వెళ్లిన ఘటన చందానగర్‌ ఠాణా పరిధిలో చోటు జరిగింది. సీఐ కాస్ట్రో, ఎస్‌ఐ అహ్మద్‌ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్‌ హుడా కాలనీ దగ్గర ఇంజినీర్స్‌ ఎన్‌క్లేవ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మామిళ్లపల్లి శ్రీహర్ష (28), సోలార్‌ ఇంజినీర్‌గా పనిచేసే అతని స్నేహితుడు సాయిరాం ప్రసాద్‌ ఉంటున్నారు. గురువారం రాత్రి 7గంటల సమయంలో శ్రీహర్ష ఒక్కడే ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఎత్తుగా ఉన్న వ్యక్తి లేడా? అతనితో బిజినెస్‌ మాట్లాడాలని అడిగారు. బయటకి వెళ్లాడు.. కొద్దిసేపట్లో వస్తాడు.. కూర్చోవాలని శ్రీహర్ష చెప్పాడు. వారు మంచినీళ్లు అడగడంతో శ్రీహర్ష కిచెన్‌లోకి వెళ్తుండగా ఇద్దరూ అతని వెనకాల వెళ్లి తీవ్రంగా కొట్టారు. గోడకేసి కొట్టడంతో తలకి గాయమై హర్ష కూలబడిపోయాడు. అయినా వదలకుండా పైన కూర్చొని కాళ్లని, చేతుల్ని తీగలతో కట్టారు. నోట్లో వస్త్రాలు కుక్కారు. ‘‘చస్తావని వదిలేస్తున్నాం. మా అన్న జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయి’’ అని హెచ్చరించారు. వెళ్తూ ఒక ల్యాప్‌టాప్‌, రెండు సెల్‌ఫోన్లు, ఒక ఏటీయం కార్డుతోపాటు రూ.3500 నగదు తీసుకెళ్లారు. తరువాత వచ్చిన సాయిరాం అతని కట్లు విప్పి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అనంతరం చందానగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదుచేశారు. సీఐ, ఎస్‌ఐలు క్లూస్‌ టీంతో వివరాలు సేకరించారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.


పాత కక్షతోనేనా?

రెండు వారాల క్రితం తమపై దాడి జరిగిందని చందానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడమే తాజా ఘటనకు ప్రధాన కారణమై ఉండొచ్చని శ్రీహర్ష, సాయిరాం చెబుతున్నారు. జులై 15న రాత్రి వీరు ఇంటి దగ్గర ఉండగా స్థానికంగా ఉండే ఓ వ్యక్తి మద్యం మత్తులో, తన స్నేహితుడితో కలిసి వేగంగా కారులో వచ్చాడు. అక్కడున్న శ్రీహర్ష, సాయిరాంలను దూషించి తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితులు ఆ రాత్రే ఠాణాలో ఫిర్యాదుచేశారు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజా దాడిలో మా అన్న జోలికొస్తే ఊరుకోమని హెచ్చరించి వెళ్లడాన్ని బట్టి పాత ఘటనకు సంబంధించి జరిగిన దాడిగా భావిస్తున్నామని బాధితులు తెలిపారు. తాజా ఘటనపై దోపిడీ కేసుగా నమోదు చేశామని పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని