Crime News: మనవడిని హతమార్చిన అమ్మమ్మ.. కుమార్తెకు రెండో పెళ్లి చేసేందుకు ఘాతుకం
close
Updated : 31/07/2021 08:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime News: మనవడిని హతమార్చిన అమ్మమ్మ.. కుమార్తెకు రెండో పెళ్లి చేసేందుకు ఘాతుకం

తొలుత అదృశ్యమయ్యాడంటూ నాటకం

సంగారెడ్డిలో చోటు చేసుకున్న ఘటన

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: మనవడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన అమ్మమ్మే.. ఆ చిన్నారిని హతమార్చింది. ఈ అమానవీయ ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. మనవడిని అంతమొందిస్తే తన కుమార్తెకు రెండో పెళ్లి చేసేందుకు మార్గం సుగమమవుతుందని ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. డీఎస్పీ బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని రాజంపేటకు చెందిన ఓ వివాహితకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడి వయసు ఐదేళ్లు. చిన్న కుమారుడికి ఏడాదిన్నర. ఆమె భర్త రెండేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి పిల్లలతో సహా తల్లి నాగమణి వద్ద ఉంటోంది. గురువారం సదాశివపేటకు కూలి పనులకు వెళ్లింది. నాగమణి తాను కిరాణా దుకాణానికి వెళ్లగా ఇంట్లో నుంచి చిన్న మనవడు అదృశ్యమయ్యాడని పోలీసులకు సమాచారం ఇచ్చింది.

ప్రవర్తనపై అనుమానంతో..

పోలీసులు కేసు నమోదు చేసి అమ్మమ్మ తీరుపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. తొలుత చంపి శివ్వంపేట వంతెన కింద పడేశానంటూ చెప్పింది. శుక్రవారం గాలించగా ఆమె మాటలు నిజం కాదని తేలడంతో, ఆ తర్వాత సంగారెడ్డిలోని బొబ్బిలికుంటలో పడేసినట్లుగా పేర్కొంది. పోలీసులు నిందితురాలిని అక్కడికి తీసుకెళ్లి గాలించగా అప్పటికే బాలుడు మురుగు నీరు మింగి ప్రాణాలు కోల్పోయాడు. కుమార్తెకు పుల్కల్‌ మండలం బద్రీగూడెంకు చెందిన జనార్దన్‌తో కొంత కాలంగా పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అతడితో పెళ్లి చేయాలని తల్లి పథకం రచించింది. చిన్న మనవడిని అడ్డు తొలగిస్తే పెళ్లి చేసుకుంటానని జనార్దన్‌ చెప్పడంతో, నాగమణి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. రాజంపేట నుంచి కొత్త బస్టాండ్‌ వరకు ఆటోలో బాలుడిని తీసుకుని వచ్చినట్లు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. కొత్త బస్టాండ్‌ వద్ద ఆటో దిగి ఆ పక్కన రాజీవ్‌ పార్క్‌ సమీపంలోని బొబ్బిలికుంటలో మనవడిని పడేసింది. ఇంటికి వచ్చి మనువడిని ఎవరో అపహరించారంటూ రోదించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కుమార్తె అత్తగారిల్లు పుల్కల్‌ మండలం ఎస్‌.ఇటీక్యాల. నాగమణి సొంతూరు కామారెడ్డి జిల్లా పిట్లం. కొంత కాలంగా సంగారెడ్డిలో ఉంటున్నారు. నాగమణి, జనార్దన్‌లను అరెస్టు చేశామని, రిమాండ్‌కు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు. 12 గంటల్లో బాలుడి హత్యకేసును ఛేదించినందుకు సీఐ బైరీ రమేశ్‌, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లను ఆయన అభినందించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని