Crime News: పరువు తీసిందని కోడలిని హతమార్చిన మామ 
close
Updated : 31/07/2021 08:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime News: పరువు తీసిందని కోడలిని హతమార్చిన మామ 


ప్రియమణి (పాత చిత్రం)

 

మలికిపురం: కోడలు తమ కుటుంబం పరువు తీసిందని మామ ఆమెను హత్య చేసిన ఘటన మలికిపురం మండలం మేడిచర్లపాలెంలో చోటు చేసుకుంది. మలికిపురం ఎస్సై ఎం.నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. చొప్పల సత్యనారాయణ తన కోడలు ప్రియమణి(25)ని శుక్రవారం చాకుతో పొడిచి హత్య చేసి, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సత్యనారాయణ భార్య సోదరుడి కుమార్తె ప్రియమణితో కొడుకు విజయ్‌కుమార్‌కు ఏడేళ్ల క్రితం వివాహం చేశారు. ఈ దంపతులకు బాబు ఉన్నాడు. విజయ్‌కుమార్‌ ఖతార్‌లో ఉపాధి నిమిత్తం ఉంటున్నాడు. హతురాలి తల్లి, కుటుంబ సభ్యులు అండమాన్‌లో ఉంటున్నారు. కోడలు ఓ యువకుడితో సన్నిహితంగా ఉంటోందని.. ఆమె నడవడిక సరిగాలేదని కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయి. ఈ నెల 22న ప్రియమణి సదరు యువకుడితో కలిసి వెళ్లిపోయినట్లు సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారిని వెతికి తీసుకొచ్చిన పోలీసులు ఆమెకి కౌన్సెలింగు ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ప్రియమణి తల్లి మంజుల అండమాన్‌ నుంచి మేడిచర్లపాలెం వచ్చింది. ఈ సందర్భంగా ఇంట్లో కోడలికి, మామకు ఘర్షణ జరగడంతో కోపంలో చాకుతో ఆమెను పొడిచాడు. ఆ సమయంలో తల్లి మంజుల అడ్డురాగా స్వల్ప గాయాలయ్యాయి. రాజోలు సీఐ దుర్గాశేఖరరెడ్డి పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని