ఒక్కసారి చెబితే గుర్తుండిపోతుంది అంతే!
close
Updated : 06/08/2021 05:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్కసారి చెబితే గుర్తుండిపోతుంది అంతే!

బుడి బుడి అడుగుల బుడత అందరితో శభాష్‌! అనిపించుకుంటోంది అద్భుత ప్రతిభతో అందరూ అవాక్కయ్యేలా చేస్తోంది.. ఇంతకీ ఈ చిన్నారి ఏం చేస్తోంది.. అంతా ఎందుకు ఔరా! అంటున్నారు తెలుసుకోవాలని ఉందా.. అయితే ఇంకేం.. చదివేయండి మరి ఈ కథనం..

డాదిన్నర వయసులో అందరూ ఏం చేస్తారు? మాటలు నేర్చుకుంటూ ఉంటారు. తల్లిదండ్రుల వేలు పట్టుకుని అడుగులు వేస్తూ ఉంటారు. కానీ కేరళ మలప్పురానికి చెందిన ఇక్షా మాత్రం తన జ్ఞాపకశక్తితో అందరూ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

ఏడు నెలలప్పుడే ప్రారంభం!

ఇక్షాకు ఏడు నెలల వయసున్నప్పుడు అమ్మానాన్న అన్షిద్‌, ఎన్‌.కృష్ణ ఓ రోజు ఆంగ్ల వర్ణమాలలోని 'A' అక్షరాన్ని నేర్పించారు. అంతే ఆ చిన్నారి బిల్‌బోర్డులపైన, పోస్టర్లపై ఉండే పదాల్లో 'A' అక్షరాన్ని గుర్తిస్తూ చెప్పేది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపోయారు. ఇక్షాకు మరిన్ని అక్షరాలు, సంఖ్యలను నేర్పించడం ప్రారంభించారు.

రికార్డు సృష్టించింది

26 రకాల జంతువులు, 12 రకాల సముద్ర ప్రాణులు, 20 రకాల పుష్పాలు, 20 రకాల వాహనాలు, 24 రకాల కూరగాయలు.. పండ్లు, 10 ఆహార పదార్థాలు, 6 సంగీత వాయిద్య పరికరాలు,  24 గృహోపకరణాలు, 1 నుంచి 20 వరకు సంఖ్యలు, త్రిభుజం, చతురస్రం, దీర్ఘచతురస్రం వంటి 10 రకాల ఆకారాలను ఇట్టే గుర్తించగలదు. ఇలా తన జ్ఞాపకశక్తితో ఏకంగా ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది.

రోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూ..

గజిబిజిగా ఉన్న ఆంగ్ల అక్షరాలను చిన్నారి ఇక్షా వరస క్రమంలో పెట్టగలదు. పజిళ్లను పూర్తి చేయగలదు. శరీరభాగాలు, సంప్రదాయ నృత్యాలనూ గుర్తించగలదు. అమ్మానాన్న సహకారంతో రోజుకు కనీసం ఓ కొత్త విషయాన్నైనా మన ఇక్షా నేర్చుకుంటోంది. కేవలం నేర్చుకోవడమే కాదు.. అస్సలు మరిచిపోవడమే లేదు. అంత చిన్న వయసులో ఇంతటి ప్రతిభను ప్రదర్శిస్తుండటం నిజంగా గ్రేట్‌ కదూ! మరి ఈ చిన్నారి భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని