పిల్లల్లో కొవిడ్‌ కాలేయవాపు!
close
Updated : 10/08/2021 05:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లల్లో కొవిడ్‌ కాలేయవాపు!

కొవిడ్‌-19 పిల్లలను పెద్దగా ఇబ్బందేమీ పెట్టటం లేదు. కానీ కొందరిలో గుండె, రక్తనాళాలు, కళ్లు, చర్మం వంటి అవయవాలను ప్రభావితం చేస్తోంది. దీన్నే మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌ (మిస్సీ) అంటున్నాం. కొవిడ్‌-19 అనర్థాలు దీంతోనే ఆగటం లేదు. ఇది పిల్లల్లో కాలేయవాపు (హెపటైటిస్‌) సైతం తెచ్చిపెడుతున్నట్టు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) అధ్యయనం పేర్కొంటోంది. రెండోసారి కొవిడ్‌-19 విజృంభించిన సమయంలో ఉన్నట్టుండి కాలేయవాపు లక్షణాలు బయటపడిన పిల్లలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. మూడు నుంచి ఆరు వారాల క్రితం కొవిడ్‌ బారినపడ్డ కొందరు పిల్లల్లో కుటుంబంలో ఎవరికీ కాలేయ జబ్బులు లేకపోయినా హెపటైటిస్‌ లక్షణాలు కనిపించాయి. వీరిలో చాలామందిలో కొవిడ్‌ లక్షణాలేవీ లేకపోవటం గమనార్హం. కొందరు పిల్లలో మిస్సీ తరహా లక్షణాలు పొడసూపాయి. డెల్టా వంటి కొత్త కరోనా వైరస్‌ రకాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో పిల్లల్లో కాలేయవాపు లక్షణాలపై ఓ కన్నేసి ఉంచటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని