ఒలింపిక్‌ బుడతలు!
close
Published : 11/08/2021 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒలింపిక్‌ బుడతలు!

ఒలింపిక్స్‌లో మన అన్నయ్యలు, అక్కయ్యలు భలేగా పతకాలు సాధిస్తున్నారు కదా! వాళ్లే కాదు.. మన నేస్తాలు కూడా ఒలింపిక్స్‌లో సత్తా చాటుతున్నారు. పతకాలు తెచ్చుకుని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంతకీ వాళ్లెవరో తెలుసుకుందామా!

పాన్‌కు చెందిన కొకానా హిరాకి. వయసు 12 ఏళ్లు. కానీ తన స్కేట్‌బోర్డింగ్‌ చూశారంటే తనేనా చేసింది అని ఆశ్చర్యపోతారు. స్కేట్‌బోర్డింగ్‌ మొదలు పెట్టిందంటే రివ్వున దూసుకుపోతూ ఔరా! అనిపిస్తుంది. అతిశయోక్తి కాదుగానీ హిరాకి స్కేట్‌బోర్డింగ్‌ చేస్తుంటే కళ్లు తిప్పుకోలేం. అలా దూసుకుపోతుంది మరి. అదే స్పీడుతో మొన్న జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించింది. దాంతో ఒలింపిక్స్‌లో పతకం పొందిన వారిలో అతి పిన్న వయస్కురాలిగా హిరాకి చరిత్ర సృష్టించింది.

మరో చిన్నారి కూడా..

హిరాకి 12 ఏళ్లకు రజతం గెలిస్తే.. స్కైబ్రౌన్‌ అనే 13 ఏళ్ల చిన్నారి స్కేట్‌బోర్డింగ్‌లోనే కాంస్య పతకాన్ని సాధించింది. ఈ చిన్నారి కూడా తన అద్భుతమైన ప్రతిభతో అందరితో ప్రశంసలు అందుకుంటోంది. వీళ్లిద్దరూ ఇంత చిన్న వయసులో ఒలింపిక్స్‌లో పతకం సాధించడం అన్నది మామూలు విషయం కాదు కదా! దాని వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉంది. ఇక ఈ పోటీలు జరిగాక అక్కడకు ఒక విలేకరి వచ్చి... ‘అమ్మాయిలు స్కేట్‌బోర్డింగ్‌లో పెద్దగా రాణించలేరట కదా!’ అన్నారట. అందుకు వీళ్లేం చెప్పారో తెలుసా? క్రీడల్లో లింగభేదాలేం ఉండవు. అందరూ సమానమే అని బదులిచ్చారట.
చూశారా.. ఆత్మ విశ్వాసం అంటే అలా ఉండాలి. మరింకెందుకాలస్యం ఈ బుడతలకు అభినందనలు తెలిపేద్దామా!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని