జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌
close
Published : 05/01/2017 16:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌

న్యూదిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రిసెర్చ్‌ (ఐసీహెచ్‌ఆర్‌) 2016-17 సంవత్సరానికి జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

* ఫెలోషిప్‌ల సంఖ్య: 80
* అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల్లో హిస్టరీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీలో ప్రవేశం పొంది ఉండాలి.
* ఫెలోషిప్‌: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.16 వేలు ఇస్తారు. కంటింజెన్సీ గ్రాంట్‌ కింద ఏడాదికి 15 వేల చొప్పున రెండేళ్లు చెల్లిస్తారు.
* పరీక్షా విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

1) 30 మార్కులకు 30 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు.
2) 12 షార్ట్‌ ఎస్సే టైప్‌ ప్రశ్నల్లో అభ్యర్థులు 6 ప్రశ్నలకు 100 పదాల్లో సమాధానం రాయాల్సి ఉంటుంది. వీటికి 30 మార్కులు కేటాయించారు.
3) మరో 6 వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఏవైనా రెండు ప్రశ్నలకు ఒక్కోదానికి 500 పదాల్లో జవాబు రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 20 మార్కులు.

* పరీక్ష కేంద్రాలు: న్యూదిల్లీ, బెంగళూరు, గువహటి, పుణె
* దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 19 జనవరి
* పూర్తి చేసిన దరఖాస్తులు చేరడానికి చివరి తేది: 31 జనవరి
* వెబ్‌సైట్‌: www.ichr.ac.in


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని