Keep the wolf from the door
close
Published : 13/03/2017 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Keep the wolf from the door

Keep the wolf from the door

ఇంగ్లిష్‌లో వాడుకలోకి వస్తున్న వ్యక్తీకరణలను గమనిస్తూ, వాటి ప్రయోగాన్ని తెలుసుకోవడం విద్యార్థులకు చాలా అవసరం. ఈవారం అలాంటి కొన్ని Expressions ను ఉదాహరణలతో నేర్చుకుందాం!
Vasaanth: Hi Goutham, how goes life? (హాయ్‌ గౌతమ్‌, ఎలా సాగుతోంది జీవితం?)
Goutnam: Not so bad. Just getting on. The new job is not that paying. However, I am able to make both ends meet (ఫర్వాలేదు. ఏదో లొక్కొస్తున్నాను. నా కొత్త ఉద్యోగం జీతం అంత ఎక్కువేం కాదు, కానీ అవసరాలు తీర్చుకోగలుగుతున్నాను).
Vasanth: What are your future plans? (నీ భవిష్యత్తు పథకాలేంటి?)
Goutham: Keep trying for a better job. The pay that I get in my present job is just enough to keep the wolf from the door. I can't put aside anything for a rainy day with this kind of salary (ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాన్వేషణ. ఇప్పుడు నాకొస్తున్న జీతం ఏదో ఆకలి లేకుండా బతకడానికి సరిపోతోంది. ఈ జీతంతో అవసరానికి కొంత పక్కనపెట్టడానికి కూడా కుదరడం లేదు).
Vasanth: That is very farsighted of you. The earlier you get a better job, the better for you (అది నీ దూరాలోచన. నువ్వెంత త్వరగా మంచి ఉద్యోగం సంపాదించుకుంటే అంత మంచిది).
Goutham: I will keep my sights raised. Who could we ask for money in times of need? (నేను పెద్దవాటి మీదే బతుకుతున్నాను. ఎవరిని డబ్బులు అడగగలం, మనకు అవసరమైనప్పుడు?)
Vasanth: Your taking up this job has already raised a few eyebrows. They feel that you are over-qualified for this job (అసలు నువ్వు ఈ ఉద్యోగం స్వీకరించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది నీ విద్యార్హతలకు చాలా తక్కువస్థాయి ఉద్యోగం).
Goutham: But what can I do? I have to earn some money to get on. But as I have told you this is only a stopgap job. I am not going to stick to it for long. Already I have applied for two or three better jobs. Once I get any of them I will quit this job (కానీ ఏం చేయను? జీవితం సాగడానికి డబ్బు అవసరం కదా? కానీ నీతో అన్నాను కదా- ఇది తాత్కాలికమేనని. నేను ఎంతోకాలం దీనికి అంటిపెట్టుకుని ఉండను. ఇప్పటికే రెండు మూడు మేలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. వాటిల్లో ఏదైనా వస్తే ఈ ఉద్యోగాన్ని వదిలేస్తాను).
Vasanth: Wish you all luck (నీకు ఆ అదృష్టం కలగాలని నా కోరిక).
Goutham: Thank you. I have to take my medicine. When a better job was on the plate I rejected it (ధన్యవాదాలు. అంతకుముందు వచ్చిన మంచి ఉద్యోగాన్ని కాదన్నాను. నేను చేసిన తప్పుకు అనుభవించాల్సిందే).
Vasanth: Wish you all luck (నిన్ను అదృష్టం వరించాలి).
Now look at the following sentences from the conversation above:
1. Keep the wolf from the door = save oneself from hunger / have enough money to eat and live (జీవిత కనీసావసరాలు తీరడం- తిండి, బట్ట, ఆశ్రయానికి కొదవ లేకుండా ఉండటం).
a) Krishna: When will India see better days? Still nearly 30% of Indians live below the poverty line (భారత్‌కు మంచిరోజులు ఎప్పుడు వస్తాయి? ఇంకా 30 శాతంమంది భారతీయులు దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారు).
Jayakumar: No idea when India will see better days. A good number of Indians cannot still keep the wolf from the door (భారత్‌ మంచిరోజులు ఎప్పుడు చూస్తుందో అనేది తెలీడం లేదు. చాలామంది భారతీయులు కనీసావసరాలకు కూడా నోచుకోవడం లేదు).
b) Kanaka Rao: Why did he accept such a low paying job? Can he make both ends meet with that kind of salary? (అంత తక్కువ జీతం వచ్చే ఉద్యోగంలో ఎందుకు చేరాడు? అలాంటి జీతంతో అన్ని అవసరాలూ తీర్చుకోగలడా?)
Rathnam: What can he do? The least he can do is to keep the wolf from the door (ఏం చేయగలడు మరి? కనీసం ఆ కొంత జీతంతో ఆకలినైనా దూరంగా ఉంచగలడు).
2. Keep one's sights raised / raise one's sights = Aim at higher things in life (జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవడం).
a) Venkatesh:  Are you content with the low salary you are getting? (నీకు వస్తున్న తక్కువ జీతంతో తృప్తి పడుతున్నావా?)
Natesh: Not for long, I assure you. I must of course raise my sights and get a better job (ఎక్కువ కాలం కాదు, నీకు గట్టిగా చెబుతున్నా. యదార్థంగా అయితే ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ఇంతకంటే మంచి ఉద్యోగం పొందాలి).
3. Raise a few eyebrows = Shock and surprise people for a short time (ప్రజలను తాత్కాలికంగా సంభ్రమాశ్చర్యాలకు గురిచేయడం).
a) Abhiram: His marrying that girl - what do you think of it? (అతడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం- దాని గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్‌?)
Anjani: Of course it has raised a few eye brows, as the girl is not from a rich enough family. But so long as the couple is happy why should anybody worry? (నిజమే, అది కొంతమందిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచింది, తాత్కాలికంగా ఎందుకంటే ఆ అమ్మాయి అంత ఉన్నత కుటుంబానికి చెందింది కాదు. కానీ ఆ దంపతులిద్దరూ సంతోషంగా ఉన్నంతకాలం ఎవరైనా ఆందోళన చెందాల్సిన అవసరం ఏముంది?)


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని