డబ్బు చాల్లేదా..?Feel the pinch
close
Published : 22/05/2017 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డబ్బు చాల్లేదా..?Feel the pinch

డబ్బు చాల్లేదా..?Feel the pinch

ఇంగ్లిష్‌ రాతలో, సంభాషణల్లో Phrasal verbsను ఉపయోగించడం వల్ల భాష సహజంగా ఉంటుంది. ఈవారం కొన్నింటిని ఉదాహరణల సాయంతో నేర్చుకుందాం!
Gopal: I am in two minds whether to attend the meeting tomorrow or not. I have some other important work to attend to (రేపు మీటింగ్‌కు వెళ్లాలా వద్దా అనే రెండు ఆలోచనల్లో ఉన్నా. నాకు రేపు ఓ ముఖ్యమైన పని ఉంది).
Rajaram: I spoke to Srinivas and he has agreed to go in your place (నేను శ్రీనివాస్‌తో మాట్లాడాను. నీ బదులు అతను వెళ్తున్నాడులే).
Gopal: O, what a relief! If I donÕt attend to the other work I have, I lose a lot of money. I am already hard-pressed for cash (ఎంత హాయిగా ఉందో ఇప్పుడు! నేను ఆ ఇంకో పని విషయం చూడకపోతే చాలా డబ్బు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే నేను డబ్బు విషయంలో ఇబ్బందులు పడుతున్నా).
Rajaram:I understand how you feel the pinch. You have to pay for your sonÕs enormous fee in the private university (నాకు తెలుసు, డబ్బు విషయంలో నువ్వెంత ఇబ్బంది పడుతున్నావో. మీ అబ్బాయి చేరబోయే ప్రైవేటు యూనివర్సిటీలో డబ్బు కట్టాల్సి ఉంది).
Gopal: Moreover those who attend the meeting are not the good sort. They latch on to me and bore me to death (అంతేకాదు, ఆ మీటింగ్‌కు వచ్చేవాళ్లు మంచి రకాలు కాదు. వాళ్లు నన్ను వదలకుండా పట్టుకుని చచ్చేంత విసిగిస్తారు).
Rajaram:It is very clever of you to look ahead. You need the money not now, but two years later. ThatÕs when your son will join the business school, isnÕt it? (ముందుచూపుతో నువ్వు వ్యవహరించడం చాలా తెలివైన పనే. నీకు డబ్బు అవసరం ఇప్పుడు కాదు, రెండేళ్ల తర్వాత కదా? అప్పుడు కదా మీ అబ్బాయి ఆ బిజినెస్‌ స్కూల్‌లో చేరేది).
Gopal: Leave it alone. Hari at the last meeting lashed out at me, though I was not at all at fault. I stopped speaking to him (అదలా ఉంచు. పోయిన మీటింగ్‌లో హరి నా తప్పేమీ లేకపోయినా నన్ను తీవ్రంగా విమర్శించాడు. వాడితో మాట్లాడటం మానేశాను).
Rajaram:He is out and out a rogue. I have been warning you right from the beginning to beware him (వాడు పూర్తిగా దుర్మార్గుడు. వాడి విషయంలో జాగ్రత్తగా ఉండమని మొదటినుంచీ నేను నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను).
Gopal: I didnÕt pay heed to you and I am sorry (నీ మాట నేను వినలేదు. నిజంగా దానికి బాధపడుతున్నా).
Rajaram: OK, past is past. LetÕs look into the future (సరేలే. అయిపోయిందేదో అయిపోయింది. భవిష్యత్తును గురించి ఆలోచిద్దాం).
Notes: (: 1. be in two minds = unable to decide (అటో ఇటో తేల్చుకోలేక పోవడం) 2. be hard-pressed = having a lot of difficulty (చాలా కష్టాల్లో ఉండటం) 3. Look ahead = think much in advance (ముందుచూపుతో ఆలోచించడం) 4. out and out = completely (పూర్తిగా) 5. pay heed to = pay attention to (చెప్పింది వినడం).
Now look at the following sentences from the conversation above:
1) I understand how you feel the pinch
2) Moreover Hari at the last meeting lashed out at me.
3) It is very clever of you to look ahead
Now look at the above sentences in detail:
1 feel the pinch = experience the difficulty of not having enough money (డబ్బు చాలకపోవడంతో వచ్చే ఇబ్బందులు)
a) Venkatesh: God has been very unkind to him. He has three daughters to marry off and his business is in doldrums (దేవుడు అతని పట్ల చాలా నిర్దయగా ఉన్నాడు. అతనికి పెళ్లికావాల్సిన ముగ్గురు కూతుర్లు ఉన్నారు, అతని వ్యాపారం కూడా కష్టాల్లో ఉంది).
Ranganath: Yes, I know how he feels the pinch. But that is all his making. How he wasted money when he was young! (అవును. నాకు తెలుసు, అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడో, డబ్బుకు. కానీ దానికి అతనే కారకుడు. మంచి వయసులో ఉన్నప్పుడు డబ్బెంత వృథా చేశాడో!)
b) Vivek: All the best Naresh. I heard you are going on a tour of Singapore (నీకంతా మంచే జరగాలి నరేష్‌. సింగపూర్‌ వెళ్తున్నావని విన్నాను).
Naresh: Thanks a lot. If it were a year ago, I would have felt the pinch. But now I am well off, and can afford the trip (ధన్యవాదాలు. క్రితం సంవత్సరం అయితే డబ్బుకు చాలా ఇబ్బంది పడేవాణ్ణి. కానీ నా పరిస్థితి ఇప్పుడు బాగుంది, ఈ యాత్రకు వెళ్లే స్తోమత ఉంది).
2 lashed out at me - the past tense of lash out at somebody = to severely criticise somebody (తీవ్రంగా విమర్శించడం)
a) Thrimurthy: He denied that he spoiled the chances of KrishnaÕs promotion (కృష్ణ పదోన్నతి అవకాశాలను తాను నాశనం చేశానని అతను ఒప్పుకోవడం లేదు).
Eswar: I donÕt believe it. Why should Krishna lash out at him if he were that innocent? (నేనది నమ్మను. అతనంత అమాయకుడైతే కృష్ణ వాడినంత తీవ్రంగా ఎందుకు విమర్శిస్తాడు?)
b) Sathyanath: None was able to find where he was hiding. If they did, they would thrash him (వాడెక్కడ దాక్కున్నాడో ఎవరికీ తెలీదు. తెలిస్తే వాడిని బాదిపెడతారు).
Ranga Rao: Everybody is lashing out the police for letting him off so easily (అందరూ పోలీసులను తీవ్రంగా విమర్శిస్తున్నారు. వాడినంత సులభంగా వదిలేసినందుకు).
3 look ahead = Think about and plan for the future (భవిష్యత్తును గురించి ఆలోచించడం/ ముందుచూపు ఉండటం)
a) Syamala: Our children are going up, and in no time they will be adults (మన పిల్లలు ఎదుగుతున్నారు, క్షణంలో పెద్దవాళ్లు అవుతారు).
Sanjai: I know what you are driving at. Your point is we should look ahead and plan their careers (నువ్వేం చెబుతున్నావో నాకు తెలుసు. నువ్వనేదేంటంటే, మనం ముందుచూపుతో వాళ్ల భవిష్యత్తు వ్యాపకానికి పథకం వేయాలి అని).
b) Raju: What are you so deeply thinking about? (అంత తీవ్రంగా ఏం ఆలోచిస్తున్నావ్‌).
Ravi: He is in a critical condition, isnÕt he? I am trying to look ahead to what his sons might do when the end comes (అతని సంగతి అటోఇటోగా ఉంది కదా? అతని అంతం వచ్చినప్పుడు అతని కొడుకులు ఏం చేస్తారా అని ముందుచూపుతో ఆలోచించేందుకు ప్రయత్నిస్తున్నాను).


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని