వివిధ పరీక్షల కోసం...
close
Published : 12/06/2017 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వివిధ పరీక్షల కోసం...

వివిధ పరీక్షల కోసం...

తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులందరూ వివిధ పరీక్షల కోసం సిద్ధం అవుతున్నారు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ పరీక్ష కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్‌ టెస్ట్‌లో అర్హత పొందిన వారంతా మెయిన్స్‌కు ప్రిపరేషన్‌ సాగిస్తున్నారు. ఉపాధ్యాయ విద్యలోకి ప్రవేశం సాధించాలని కోరుకునేవారు డీఈఈసెట్‌కు సన్నద్ధమయ్యారు. వీరందరి కోసం ‘విజేత కాంపిటీషన్స్‌’ పలు పుస్తకాలను ప్రచురించింది.

వీటిలో స్టడీమెటీరియల్‌తోపాటు ప్రాక్టీస్‌ ప్రశ్నలు, పాత ప్రశ్నపత్రాలు, మోడల్‌ పేపర్లు అందించారు. ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ఈ టైర్‌-1 కోసం మెటీరియల్‌ ఇచ్చారు. పంచాయతీ సెక్రటరీ మెయిన్స్‌ రెండు పేపర్లకు, డీఈఈసెట్‌ కోసం సమాచారాన్ని ఇంగ్లిష్‌ మీడియంలో అందించారు. ఆంగ్లమాధ్యమంలో పరీక్ష రాయబోతున్న అభ్యర్థులు ఈ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు.

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ఈ టైర్‌-1 ప్రాక్టీస్‌ వర్క్‌బుక్‌
పేజీలు: 864, రూ. 499

2) పంచాయతీ సెక్రటరీ మెయిన్స్‌ పేపర్‌-1 (ఇంగ్లిష్‌ మీడియం)
పేజీలు: 208, ధర: 169

3) పంచాయతీ సెక్రటరీ మెయిన్స్‌ పేపర్‌-2 (ఇంగ్లిష్‌ మీడియం)
పేజీలు: 192, రూ. 169

4) డీఈఈసెట్‌ (ఇంగ్లిష్‌ మీడియం)
పేజీలు: 784, రూ. 399

5) ఆంధ్రప్రదేశ్‌ సామాజిక-ఆర్థిక సర్వే-2016-17
పేజీలు: 320, రూ. 189


జనరల్‌ సైన్స్‌, టెక్నాలజీ, సర్వేలు

ప్ర¾తి పోటీ పరీక్షలోనూ జనరల్‌ స్టడీస్‌లో భాగంగా జనరల్‌ సైన్స్‌, టెక్నాలజీ, వివిధ ఆర్థిక సర్వేల నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. ఈ విభాగాల అధ్యయనానికి ఉపకరించే మూడు పుస్తకాలను ‘ఈతరం పబ్లికేషన్స్‌’ విడుదల చేసింది. వీటిలోని మొదటి పుస్తకంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణం-సుస్థిర అభివృద్ధికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. రెండో దానిలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రాల ప్రిపరేషన్‌కు అవసరమైన మెటీరియల్‌ అందించారు. మూడో పుస్తకంలో తాజా భారత ఆర్థిక సర్వే, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సర్వే, కేంద్రం, ఏపీ బడ్జెట్‌ల ముఖ్యాంశాలను పరీక్ష కోణంలో ఇచ్చారు.

1) సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
పేజీలు: 248, రూ. 160

2) జనరల్‌ సైన్స్‌
పేజీలు: 320, ధర: రూ. 219

3) సర్వేలు-బడ్జెట్‌లు
పేజీలు: 64, రూ. 59


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని