మెయిన్స్‌ కోసం
close
Published : 19/06/2017 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెయిన్స్‌ కోసం

మెయిన్స్‌ కోసం

పీపీఎస్సీ గ్రూప్‌-2, పంచాయతీ సెక్రటరీ పరీక్షల స్క్రీనింగ్‌ టెస్ట్‌లు ముగిసి వాటి ఫలితాలు కూడా వెలువడటంతో అభ్యర్థులు మెయిన్స్‌ కోసం సిద్ధమవుతున్నారు. వీరి కోసం ‘ప్రతిమ పబ్లికేషన్స్‌’ రెండు పుస్తకాలను విడుదల చేసింది. మొదటి పుస్తకంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమాచారం అందించారు. గ్రూప్‌-2 పేపర్‌-3 కోసం ఇది ఉపయోగపడుతుంది. రెండోది పంచాయతీ సెక్రటరీ మెయిన్స్‌ పేపర్‌-2కి గ్రామీణాభివృద్ధిపై ఇచ్చారు. తాజా సామాజిక, ఆర్థిక సర్వేలు, బడ్జెట్‌ల సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు. ప్రతి అధ్యాయానికి చివర వేగంగా పునశ్చరణ చేసుకోడానికి సాయపడే ముఖ్యాంశాలను కూడా అందించారు.

1) ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీ మెయిన్స్‌ పేపర్‌-2 గ్రామీణాభివృద్ధి
పేజీలు: 392, రూ. 280
2) ఆంధ్రప్రదేశ్‌ ఎకానమి పేజీలు: 406, రూ. 299


జేఈఈ అడ్వాన్స్‌డ్‌

ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో సీటు సాధించేందుకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ లక్ష్యంగా సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ‘సెంగేజ్‌ లెర్నింగ్‌’ మూడు పుస్తకాలను ప్రచురించింది. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఫిజికల్‌ కెమిస్ట్రీ విభాగాలకు వేర్వేరుగా అందించిన ఈ పుస్తకాల్లో సిలబస్‌ ప్రకారం మౌలికాంశాలను రకరకాల నమూనా ప్రశ్నలతో ఇచ్చారు. సబ్జెక్టివ్‌ తరహా, సింగిల్‌ కరెక్ట్‌, మల్టిపుల్‌ కరెక్ట్‌, అసెర్షన్‌-రీజనింగ్‌, లింక్‌డ్‌ కాంప్రహెన్షన్‌, మ్యాచింగ్‌ కాలమ్‌ వంటి పలు రకాల ప్రశ్నలను ఈ పుస్తకాల్లో ఇచ్చారు

1) మ్యాథమేటిక్స్‌ -జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రూ. 779
2) ఫిజిక్స్‌, రూ. 729
3) ఫిజికల్‌ కెమిస్ట్రీ, రూ. 879


నాలుగు పరీక్షల కోసం

టీఎస్‌పీఎస్సీ ఇటీవల పలు రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేసింది. గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రాథమిక పరీక్షల నిర్వహణ కూడా పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో గురుకులాలు మెయిన్స్‌, ఇతర పరీక్షలకు సిద్ధమవుతున్నా అభ్యర్థుల కోసం ‘విజేత కాంపిటీషన్స్‌’ పుస్తకాలను వెలువరించింది. వీటిలో గురుకులాల్లో టీజీటీ మ్యాథ్స్‌, బయోలాజికల్‌ సైన్స్‌ సబ్జెక్టుల మెయిన్స్‌, ఏఈఈ సివిల్‌ ఇంజినీరింగ్‌, డిప్యూటీ సర్వేయర్ల పరీక్షలకు ఉపయోగపడే సమాచారం ఇచ్చారు.

1) గురుకుల టీచర్స్‌ టీజీటీ మ్యాథ్స్‌- మెయిన్స్‌
పేజీలు: 640, రూ. 549
2) టీజీటీ బయోలాజికల్‌ సైన్స్‌
పేజీలు: 432, రూ. 399
3) ఏఈఈ -సివిల్‌ ఇంజినీరింగ్‌
పేజీలు: 688, రూ. 499
4) డిప్యూటీ సర్వేయర్స్‌
పేజీలు: 944, రూ. 549Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని