సులభంగా గణితం
close
Published : 11/09/2017 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సులభంగా గణితం

సులభంగా గణితం

టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన అటవీ అధికారుల ఉద్యోగ పరీక్షకు అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు. పేపర్‌-2 జనరల్‌ మ్యాథ్స్‌కి సంబంధించి కొందరు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఎస్‌ అండ్‌ ఎస్‌ పబ్లికేషన్స్‌’ ఒక పుస్తకాన్ని వెలువరించింది. ఇందులో సిలబస్‌ ప్రకారం ఆరు విభాగాలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ముఖ్యాంశాలతోపాటు వివరణాత్మక సమాధానాలతో పలు రకాల ప్రశ్నలు కూడా ఇచ్చారు. చివర్లో ప్రాక్టీస్‌ కోసం ఇచ్చిన బిట్లు కూడా ఉపయోగకరంగా ఉన్నాయి.

ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌ జనరల్‌ మ్యాథ్స్‌
పేజీలు: 320, రూ. 199


 

మౌలికాంశాలు

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అటవీశాఖ అధికారుల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ వెలువరించింది. దీనిపై ‘వీజీఎస్‌ బుక్‌ లింక్స్‌’ రెండు పుస్తకాలను ప్రచురించింది. మొదటి పుస్తకంలో పేపర్‌-1కి సంబంధించి జనరల్‌ నాలెడ్జ్‌ సమాచారం, రెండో పుస్తకంలో పేపర్‌-2 కోసం జనరల్‌ మ్యాథమేటిక్స్‌ అందించారు. జనరల్‌ నాలెడ్జ్‌ కోసం పది విభాగాల్లో మెటీరియల్‌తోపాటు ప్రాక్టీస్‌ బిట్లు కూడా ఇచ్చారు. గణితానికి సంబంధించి ముఖ్యాంశాలతోపాటు వివరణాత్మక సమాధానాలతో బిట్లు అందించారు. ఇవి మౌలికాంశాలపై పట్టుకు సాయపడతాయి.

1) టీఎస్‌పీఎస్సీ ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌ పేపర్‌-1 జనరల్‌ నాలెడ్జ్‌,
పేజీలు: 702, రూ. 270

2) పేపర్‌-2 జనరల్‌ మేథమేటిక్స్‌,
పేజీలు: 558, రూ. 240


 

అటవీశాఖ అధికారులు