ఎథికల్‌ హ్యాకింగ్‌ చదవాలంటే?
close
Published : 12/06/2018 03:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎథికల్‌ హ్యాకింగ్‌ చదవాలంటే?

ఎథికల్‌ హ్యాకింగ్‌ చదవాలంటే?

* మా అబ్బాయి బీటెక్‌ (సీఎస్‌ఈ) రెండో సంవత్సరం చదువుతున్నాడు. తనకు ఎథికల్‌ హ్యాకింగ్‌పై ఆసక్తి. అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వివరాలను అందించండి.
  - రవిప్రసాద్‌ ఆత్కూరి
జ: హానికర హ్యాకర్లు చేయదలచుకునే దుశ్చర్యలను ముందుగా పసిగట్టి, కంప్యూటర్‌ సమాచార వ్యవస్థల బలహీనతలను, దుర్బలాలను గుర్తించే చర్యను చట్టపరంగా సాగించడమే ఎథికల్‌ హ్యాకింగ్‌ ఉద్దేశం. కంప్యూటర్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన/ చేస్తున్నవారికి ఈ కోర్సు ఎంతగానో దోహదపడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రైవేటు సంస్థలు ఎథికల్‌ హ్యాకింగ్‌లో శిక్షణ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఈసీ కౌన్సిల్‌వారు అందిస్తున్న సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకింగ్‌ కోర్సు ప్రముఖమైంది. 125 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల పరీక్షను నాలుగు గంటల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ‌www.eccouncil.org ను సందర్శించవచ్చు. ఇంకా  బీటెక్‌ రెండో సంవత్సరమే కాబట్టి, చదువు పూర్తయ్యేలోపు ఈ కోర్సును చేసి, ఏదైనా సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేస్తే మంచిది.  ప్రస్తుతానికి ఈ కోర్సు ప్రభుత్వ సంస్థల్లో అందుబాటులో లేదు.


బిజినెస్‌ అకౌంటింగ్‌ & టాక్సేషన్‌  

* బిజినెస్‌ అకౌంటింగ్‌ అండ్‌ టాక్సేషన్‌ కోర్సులను అందిస్తున్న సంస్థలు, వాటి ఫీజు వివరాలను తెలియజేయగలరు. 

- శ్రీజేష్‌ నాయర్‌
జ: మీరు ఏం చదివారో తెలియజేయలేదు. బిజినెస్‌ అకౌంటింగ్‌ అండ్‌ టాక్సేషన్‌ కోర్సులను చదవాలనుకునేవారు డిగ్రీ స్థాయిలో బీకాం (అకౌంటింగ్‌ అండ్‌ టాక్సేషన్‌), బీకాం (జనరల్‌) కోర్సులను ఎంచుకోవచ్చు. డిగ్రీతోపాటు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ) లేదా సీఎంఏ (కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ) కోర్సులను చదివితే ఈ రంగంలో అవకాశాలు ఎక్కువ. డిగ్రీ పూర్తిచేసినవారు సీఎంఏ-యూఎస్‌ కోర్సును ఎంచుకుని బిజినెస్‌ అకౌంటింగ్‌ అండ్‌ టాక్సేషన్‌ రంగంలో స్థిరపడొచ్చు. సాధారణంగా ప్రతి డిగ్రీ కళాశాలలో బీకాం కోర్సు అందుబాటులో ఉంటుంది. సీఏ కోర్సును ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) వారు, సీఎంఏ కోర్సును ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎంఏఐ) వారు అందిస్తున్నారు.
- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్

 

 

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని