శ్రమలేని గూడు!
close
Published : 16/01/2016 17:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రమలేని గూడు!

శ్రమలేని గూడు!

  నగనగా ఓ పాడుబడ్డ బావి. దాని అంచుకు మొలిచిన రావి కొమ్మకు రెండు పిట్టలు విడివిడిగా గూళ్లు అల్లుకుంటున్నాయి. మొదటి పిట్ట కష్ట జీవి. వేకువనే లేచి బయటికి వెళ్లి పీచు, ఈనెలు సేకరించి, గూడును అల్లి ఆహారానికై ఎగిరిపోయేది.

రెండవ పిట్టకు బద్ధకం ఎక్కువ. ఉన్నచోట నుంచి బయటకు వెళ్లకపోయేది. దాని గూడు అది కట్టుకోవడానికి కూడా ఒళ్లు బరువయ్యేది. అందుకని అది ఒక ఉపాయం ఆలోచించింది. మొదటి పిట్ట అల్లుతున్న గూటిలో నుంచి పీచు, ఈనెలు దొంగతనంగా తీసుకోవాలనుకుంది. మొదటి పిట్ట గూడు అల్లుతూ మధ్యలో ఆహారం కోసం బయటకు వెళ్లే సమయంలో రెండో పిట్ట దాని గూట్లో నుంచి కావాల్సిన సరంజామా తీసుకుంటూ గూడును అల్లుకోసాగింది.  జరుగుతున్న మోసాన్ని మొదటి పిట్ట గుర్తించలేకపోయింది. కొన్ని రోజులకు రెండవ పిట్ట గూడు పూర్తయిపోయింది. మొదటి పిట్ట గూడు మాత్రం అసంపూర్తిగా మిగిలింది. అయినా మొదటి పిట్ట ఏమాత్రం నిరుత్సాహపడకుండా చివరికి గూడును దృఢంగా కట్టుకుని అందులో ఉండసాగింది.

ఒక రాత్రి పెను తుపాను వచ్చింది. వర్షం ధాటికి మొదటి పిట్ట గూడు తట్టుకుంది. కానీ రెండవ పిట్ట గూడు తెగి బావిలో పడిపోయింది. ఎందుకో తెలుసా? రెండవ పిట్ట దొంగతనం చేసింది కాబట్టి, తన మోసం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో హడావుడిగా అల్లటం వల్ల గూడు బలహీనంగా తయారయ్యింది. మొదటి పిట్ట కష్టించి, నిర్భయంగా దృఢంగా అల్లటం వల్ల గూడు చెక్కు చెదరలేదు.

నీతి: కష్టమే నిలుచును కడకు... కపటమే ముంచును తుదకు

 

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని