బుజ్జి కుక్కల పిల్లి నడకలు!
close
Published : 17/01/2016 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుజ్జి కుక్కల పిల్లి నడకలు!

బుజ్జి కుక్కల పిల్లి నడకలు!

ఒక కుక్క డైనో అవతారమెత్తింది... మరో భౌభౌ మారియోలా మారింది...ఇంకోటి జీన్స్‌ వేసుకుని మోడల్‌లా వచ్చింది... ఇలా ఒక్కోటి ఒక్కో వింత వేషంలో కనిపించాయి... ఇంతకీ ఎక్కడ?

అందంగా అలంకరించుకుని క్యాట్‌వాక్‌ చేసేది మనుషులేనా! మేమూ చేస్తామంటూ బుజ్జి బుజ్జి కుక్క పిల్లలెన్నో పోటీ పడ్డాయి. నువ్వా? నేనా? అంటూ హొయలుపోతూ నడకలు ప్రారంభించాయి. చిలిపి చేష్టలతో ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదంతా న్యూయార్క్‌లోని టాంప్కిన్స్‌ స్క్వేర్‌ పార్కులో జరిగిన 25వ హాలోవీన్‌ డాగ్‌ పరేడ్‌ సంగతులు.

* ఏటా అక్టోబరులో జరిగే ఈ వేడుక ఈ మధ్యే ఘనంగా ముగిసింది. కుక్కల ప్రదర్శనలు చాలా చోట్ల జరుగుతాయి కానీ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డాగ్‌ కాస్ట్యూమ్‌ పరేడ్‌.

* దాదాపు 400 శునకాలు ఈ పరేడ్‌లో పాల్గొని తెగ సందడి చేశాయి. వీటి కోలాహలం చూడ్డానికి వేలాది మంది సందర్శకులు వచ్చారు.

* ఈ కుక్కల్లో కొన్ని మినియన్స్‌, స్పైడర్‌మ్యాన్‌, సూపర్‌ మారియో, జురాసిక్‌ పార్కు చిత్రంలోని డైనోసార్లలా, సాలెపురుగులా 

అలంకరించుకుని వస్తే, మరి కొన్ని వింత దుస్తులు ధరించి ముద్దు ముద్దు హావభావాలతో అలరించాయి. అంతేనా కొన్ని కుక్క పిల్లలైతే బుల్లి కార్లు, జీపులు వేసుకుని కూడా వచ్చేశాయి. కళ్లజోడు, సూటు బూటు ధరించి వింతగా తయారై వచ్చి అందర్నీ ఆకట్టుకున్నాయి.

 * ఈ ముస్తాబుల్ని చూసి మురిసిపోవడమే కాదండోయ్‌! వీటన్నింటిల్లో అందరి చూపుల్ని ఆకర్షించిన కుక్కగారికి ‘బెస్ట్‌ ఆఫ్‌ ది షో’గా ఎంపిక చేసి విలువైన కానుక కూడా ఇస్తారు. చనిపోయిన వారికి నివాళులు అర్పించే ‘డే ఆఫ్‌ ది డెడ్‌’ సంస్కృతికి చెందిన అంశంతో వచ్చిన కుక్క ఈసారి మొదటి బహుమతి గెలుచుకుంది.

* యజమానులు కూడా రకరకాల వేషధారణల్లో వచ్చి వీటితో పాటు తెగ హంగామా చేస్తారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని