ఇది ఆరడుగుల తేలంట!
close
Published : 17/01/2016 14:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇది ఆరడుగుల తేలంట!

ఇది ఆరడుగుల తేలంట!

ఆరడుగుల పొడవు... చాకుల్లాంటి కాళ్లు... పేద్ద తల... వింతైన ఆకారం... ఇవన్నీ ఓ తేలు ముచ్చట్లంటే నమ్మగలరా? బాబోయ్! ఎక్కడుందది? చేతిలో పట్టేంత తేలును చూసే ఉంటారు. మరి మనిషంత పొడవుండే భయంకరమైన తేలు గురించి విన్నారా? ఇదో సముద్రపు తేలు. దాని కంటబడితే ఇంకేమైనా ఉందా? అని వణికిపోకండి. ఎందుకంటే ఇప్పుడు లేదు. ఎప్పుడో కోట్ల ఏళ్ల క్రితం బతికింది. శాస్త్రవేత్తల తవ్వకాల్లో ఈ మధ్యే దీని శిలాజాలు అమెరికాలోని లోవాలో బయటపడ్డాయి.  ఇప్పటి వరకు దొరికిన సముద్రపు తేళ్లలో అతి పురాతనమైంది ఇదే. 467 మిలియన్ ఏళ్ల క్రితం సముద్రంలో తిరుగాడేది. అంటే దాదాపు 46 కోట్ల ఏళ్లకు ముందన్నమాట.  'జెయింట్ సీ స్కార్పియన్'గా పిలిచే ఈ తేలు ఏకంగా ఆరడుగుల పొడవుండేది. ఇది తిరుగాడిన కాలంలో దీని భయంకర రూపాన్ని చూసి ఇతర జీవులు గడగడా వణికిపోయేవట తెలుసా? రాతిమీద పూర్తిగా అతుక్కుపోయిన ఈ తేలు శరీర అవశేషాల్ని నెమ్మదిగా ఒలిస్తే 150 శిలాజాలు లభించాయి. వాటిని సూక్ష్మదర్శినిలో పరిశీలించి అనేక విషయాలు తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో కాళ్లకున్న వెంట్రుకల వంటి చిన్న చిన్న భాగాలు కూడా బయటపడ్డాయి. ఈ సముద్రపు తేలు అసలు పేరు 'పెంటెకొప్‌టెరస్ డెకొరహెన్సిస్'. నీటిలో వేగంగా దూసుకెళ్లే దీని తీరును బట్టి ప్రాచీన గ్రీకు కథల్లోని యుద్ధనౌక పేరు పెట్టారన్నమాట.ఇక రూపం, తీరు విషయానికి వస్తే... పేద్ద తల పైన హెల్మెట్ లాంటి కవచం, పొడవైన దేహం, ఇరువైపులా ముళ్లలాంటి కొనలతో వంకర్లు తిరిగిన రకరకాల సైజుల్లో ఐదు జతల కాళ్లతో భలేగా ఉండేదట. ఈ కాళ్లనే తెడ్డుల్లా వాడుతూ చకచకా ఈదేస్తూ శత్రు జీవుల్ని పట్టి హాంఫట్ అనిపించేదిట. ఇప్పుడున్న తేలుతో పాటు పొడవైన తోకున్న హార్స్ షూ క్రాబ్ పోలికలూ ఉండేవట. కాళ్లపై ఉన్న వెంట్రుకలతో ఇది స్పర్శను తెలుసుకుంటూ చుట్టూ ఉన్న పరిసరాల్ని పసిగడుతుండేది. మరో విశేషం ఏంటంటే? సీ స్కార్పియన్ జీవులు ఇప్పుడున్న సాలీడ్లకు పూర్వీకులు.
మీకు తెలుసా?
సముద్రపు తేళ్లలో అతిపెద్ద దాని శిలాజాలు 2007లో దొరికాయి. పేరు జాకెలోప్‌టెరస్ రెనానియే. దీని పొడవు 8.2 అడుగులు. వీటిల్లో దాదాపు 246 జాతులున్నట్లు గుర్తించారు


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని