ఫాక్‌ల్యాండ్‌ దీవులు కార్ల తాలాలు తీయరు...ఇళ్లకు తాలాలు వేయరు!
close
Published : 10/04/2016 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫాక్‌ల్యాండ్‌ దీవులు కార్ల తాలాలు తీయరు...ఇళ్లకు తాలాలు వేయరు!

ఫాక్‌ల్యాండ్‌ దీవులు కార్ల తాలాలు తీయరు...ఇళ్లకు తాలాలు వేయరు!

రాజధాని: స్టాన్లీ,
జనాభా: 2,563,
విస్తీర్ణం:12,200 చ.కి.మి 
భాషలు: ఆంగ్లం,
కరెన్సీ: ఫాక్‌ల్యాండ్స్‌ పౌండ్‌

జెండా గురించి...

  * ఫాక్‌ల్యాండ్‌ దీవుల పతాకం నీలం రంగులో 1:2 పొడవు, వెడల్పులతో ఉంటుంది. బ్రిటిష్‌ పాలనలో ఉన్నట్టు గుర్తుగా జెండా పైభాగంలో బ్రిటిష్‌ సామ్రాజ్య చిహ్నం ఉంటుంది. పతాకం కిందిభాగంలో అలల్లో ఓ నావ దానిపై గడ్డి ఆ గడ్డిపై గొర్రె నిల్చుని ఉన్న చిహ్నం ఉంటుంది. ఇక్కడ సంప్రదాయ వ్యవసాయానికి, గొర్రెల పెంపకానికి ప్రతీకగా గొర్రె, ఇక్కడ మాత్రమే ఉండే టుస్సోక్‌ గడ్డికి గుర్తుగా గడ్డి, ఈ దేశాన్ని కనిపెట్టిన జాన్‌ డేవిస్‌ గుర్తుగా నావ ఉంటుంది.

* ఇక్కడ ఏటీఎం కేంద్రాలు అసలే ఉండవు. మొత్తంగా ఒకే ఒక బ్యాంకు ఉంటుంది.
* జనాభా మొత్తంలో 70 శాతం మంది బ్రిటిష్‌ సంతతికి చెందినవారే.
* ఆంగ్లం తర్వాత రెండో భాష స్పానిష్‌.
* ఈ ప్రాంతాన్ని మొదటగా గుర్తించింది 1592లో. కానీ పూర్తిగా తెలిసింది మాత్రం 1690లో.
* ప్రకృతిని ఇష్టపడే వారికి ఇదో మంచి పర్యటక ప్రాంతం. ఎలిఫెంట్‌ సీల్స్‌, సీ లయన్స్‌తో పాటు 220పైగా పక్షి జాతులుంటాయి.
దాదాపు అయిదు లక్షలకు పైగా పెంగ్విన్‌ జతలుంటాయి.

* మొత్తం 740 దీవుల సమూహమే ఫాక్‌ల్యాండ్‌ దీవులు.
* ఇది దక్షిణ అట్లాంటిక్‌ సముద్రంలో ఉంటుంది.
* ఇక్కడ జనాభా చాలా తక్కువ. అంతా కలిపి దాదాపు మూడువేలమంది లోపే ఉంటారు.
* ఇక్కడున్న గొర్రెలను మనుషులకు పంచితే ఒక్కొక్కరికీ 350 వస్తాయి. అంటే గొర్రెల సంఖ్యే చాలా ఎక్కువ.
* ఒకే ఒక పట్టణం ఉంటుంది. పేరు స్టాన్లీ. జనాభా మొత్తంలో దాదాపు 2500 మంది ఇక్కడే నివసిస్తారు. స్టాన్లీ కాకుండా ఇతర ప్రాంతాన్ని ‘క్యాంప్‌’ అని పిలుస్తారు. క్యాంపో అనే పదం నుంచి వచ్చిన ఈ మాటకు అర్థం స్పానిష్‌లో ‘దేశం వెలుపల’ అని.
* ‘ది పెంగ్విన్‌ న్యూస్‌’ పేరిట ఒకే ఒక వార పత్రిక మాత్రమే ఉంటుంది.
* నేరాల సంఖ్య చాలా తక్కువ. కొంతమంది కారు తాళాలు కారులోనే వదిలివెళతారు. ఇక్కడ కొన్ని ఇళ్లకు తలుపులు కూడా ఉండవు.
* ఫోను నెంబరు అయిదు అంకెల్లో మాత్రమే ఉంటుంది. ఈ దేశంలో మొబైల్‌ ఫోన్ల వాడకం 2005 నుంచే మొదలైంది.
* ప్రపంచం మొత్తంగా ‘బ్లాక్‌ బ్రౌడ్‌ అల్బట్రోస్‌’ అనే సముద్ర పక్షుల్లో 70 శాతం ఇక్కడే ఉన్నాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని