భలే భలే భౌభౌల స్వర్గం!
close
Published : 22/04/2016 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భలే భలే భౌభౌల స్వర్గం!

భలే భలే భౌభౌల స్వర్గం!

దో నేలపై స్వర్గం. కానీ ఎవరిదో తెలుసా? వీధి కుక్కలది. అవును. వందలాది వీధి శునకాల ప్రత్యేక ప్రాంతమది. చూడాలంటే అమెరికాలోని కోస్టారికా వెళ్లాల్సిందే.
* ‘టెరిటోరియే డి జాగ్వాట్స్‌’గా పిలిచే ఈ ప్రాంతంలో 900కిపైగా భౌభౌలు ఉంటాయి. అందుకే దీన్ని ‘ల్యాండ్‌ ఆఫ్‌ స్ట్రే డాగ్స్‌’, ‘డాగ్‌ హెవెన్‌’ అనీ అంటారు.

* వీటికి మన పెంపుడు కుక్కల్లానే పేర్లుంటాయి. బోలెడు సౌకర్యాలూనూ. వీటికి రోజూ చక్కగా స్నానాలు చేయిస్తారు. కడుపునిండా తిండి పెడతారు. సరదాగా విహారానికి పంపిస్తారు. ఇవన్నీ ఎవరు చేస్తారంటే... అక్కడున్నవాళ్లే. స్వచ్ఛందంగా పాల్గొంటూ శునకాల ఆలనాపాలనా చూస్తుంటారు. హాయిగా తిరుగుతున్న ఈ పప్పీల్ని చూస్తే ఏదో గొర్రెల మందనో, మేకల మందనో అన్నట్టుగా అనిపిస్తుంది. పైగా ఇవి దేనికదే ప్రత్యేక జాతికి చెందినవి. అంటే ఈ ఒక్క చోటనే వందలాది జాతులకు చెందిన కుక్కలుంటాయన్నమాట.

* కొన్ని సంవత్సరాల క్రితం అల్వరో సామెట్‌, లియా బాటిల్‌ అనే భార్యాభర్తలు మొదటగా వీధికుక్కల్ని చేరదీశారు. నెమ్మదిగా స్థానికులంతా భౌభౌల బాగోగులు చూడ్డం మొదలుపెట్టారట. వీటిని చూడ్డానికి శునకాల ప్రియులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఏదైనా బుజ్జికుక్క నచ్చితే వెంట తీసుకెళతారు


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని