e’-తరం ఆటోలొచ్చాయి..
close
Published : 02/03/2018 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

e’-తరం ఆటోలొచ్చాయి..

e’-తరం ఆటోలొచ్చాయి..

‘ఆటో.. వస్తావా?’ మనం ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోవాలాలను అడిగే మాట ఇది. ఎక్కి కూర్చున్నామా ఇక భరించలేని శబ్దకాలుష్యం, వాయు కాలుష్యం. అసలే మైలేజీ తక్కువ కావడంతో ఆ భారాన్ని ఛార్జీల రూపంలో ప్రయాణికులే భరించక తప్పదు. ఇలాంటి అన్ని సమస్యకు చెక్‌ పెట్టేలా ఈ-ఆటోలు అందుబాటులోకి వచ్చేశాయి.
2030 కల్లా భారత్‌ను వందశాతం ఇ-వాహనాలున్న దేశంగా మార్చాలనే తలంపుతో ఉంది ప్రభుత్వం. దానికి మద్దతుగా పలు కంపెనీలు విద్యుత్తు ఆటోలతో ముందుకొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ‘అడాప్ట్‌ మోటార్స్‌’ అనే అంకురసంస్థ ఇలాంటి బ్యాటరీ ఆటోల తయారీకి సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటే త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకొస్తామంటున్నాడు సంస్థ డైరెక్టర్‌ మామిడోజు భరత్‌.


లాభాలేంటి?

* సాధారణ ఆటోలతో పోలిస్తే.. ఈ ఆటోల్లో వాయు, శబ్ద కాలుష్యం లేకపోవడంతో పొగతో వచ్చే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇవి పర్యావరణహితమైనవి.
* కేవలం బ్యాటరీలతో నడవడం వల్ల సర్వీసింగ్‌ ఖర్చు దాదాపు ఉండదు. ఆటో యజమానులకు లాభం. ప్రయాణికుల నుంచి తక్కువ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది.
* ఇంధనంతో నడిచే ఆటోలతో పోలిస్తే బరువు తక్కువగా ఉండటంతో నియంత్రి వేగంతో వెళతాయి కాబట్టి ప్రమాదాలు జరగడానికి తక్కువ అవకాశాలుంటాయి.
* ఈ-ఆటోలకు సాధారణ గృహావసరాలకు వాడే ప్లగ్‌ పాయింట్‌ సరిపోతుంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 90 కిమీలు ప్రయాణిస్తాయి. ఛార్జీకి కేవలం రూ.50 వ్యయమవుతుంది.
* ధర రూ.1.4-1.6 లక్షల మధ్యలో ఉంటుంది. వినియోగదారుడి అవసరాలు, మోడల్‌బట్టి ధరల్లో మార్పులుంటాయి.


ఇవీ కంపెనీలు

* మహీంద్రా: భారత్‌లో ఈ కంపెనీ ఇ-వాహనాల విషయంలో ముందుంది. ఇటీవల జరిగిన వాహన ప్రదర్శనలోనూ ‘ట్రెయో’ పేరిట ఓ ఇ-ఆటోను ఆవిష్కరించింది.
* లోహియా: ఈ కంపెనీ కూడా వాహన ప్రదర్శనలో కంఫర్ట్‌ అనే ఆటోను విడుదల చేసింది.
* ఇవే కాకుండా భారత్‌లో పలు అంకుర సంస్థలు ఈ ఇ-ఆటోల తయారీ, విక్రయాల్లో ఉన్నాయి.
* హైదరాబాద్‌ విషయానికొస్తే అడాప్ట్‌ మోటార్స్‌, గాయమ్‌ మోటార్స్‌ తదితర కంపెనీలున్నాయి.



Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని