మీరెలాంటి బైకర్‌?
close
Published : 16/03/2018 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీరెలాంటి బైకర్‌?

మీరెలాంటి బైకర్‌?

కుర్ర బైకర్ల చేతికి యాక్సిలరేటర్‌ అందితే బండి గిర్రున తిరగాల్సిందే. క్షణాల్లో వంద కిలోమీటర్ల వేగం అందుకోవాల్సిందే. నడిపే మాటెలా ఉన్నా మంచి బైకర్‌కి, చెడ్డ బైకర్‌కి కొన్ని తేడాలుంటాయి అంటారు నిపుణులు. సూటిగా.. సుత్తి లేకుండా ఇదిగో ఇలా చెప్పుకోవచ్చు.
* హెల్మెట్‌
మంచి బైకర్‌: బైక్‌ ఖరీదెంత? ఇంజిన్‌, మైలేజీ సంగతేంటి? వీటి గురించి ఎంతలా పట్టించుకుంటాడో హెల్మెట్‌ ధరించడం కూడా అంతే ముఖ్యం అనుకుంటాడు. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే తలకి దెబ్బ తగలకుండా.. బలంగా వీచే చలి గాలుల నుంచి ఇది రక్షణగా పని చేస్తుంది.
చెడ్డ బైకర్‌: హెల్మెట్‌ అంటే తలకి పెద్ద భారంలా భావిస్తాడు. పరిసరాలపై ఉన్న ధ్యాస రక్షణపై ఏమాత్రం ఉండదు.

* ముఖ కవచం
మంచి బైకర్‌: అకస్మాత్తుగా ఎగిరిపడి వచ్చే రాళ్లు, కీటకాల నుంచి రక్షించుకునేందుకు మొహాన్ని కవర్‌ చేసుకునేందుకు ఏదైనా రక్షక కవచం లేదా పూర్తిస్థాయి హెల్మెట్‌ ధరిస్తాడు.
చెడ్డ బైకర్‌: ఎలాంటి రక్షణ చర్యలు పాటించడు. మొండి తల, మొండి ధైర్యం. కనీసం ఇతరులు చెప్పింది వినే ప్రయత్నం కూడా చేయడు. నిద్రమత్తు కళ్లు.. దుమ్ము కొట్టుకుపోయిన మొహం.. నీళ్లు కారే కళ్లు.. గాలికి రేగిపోయిన జుత్తు.. ఇతగాడి లక్షణాలు.

* గ్లోవ్స్‌
మంచి బైకర్‌: బైక్‌ నడిపేటప్పుడు చేతులు, వేళ్లు సౌకర్యంగా ఉండేందుకు, త్వరగా అలసిపోకుండా వీటిని తప్పనిసరిగా వాడతాడు. సీజన్‌ మారితే గ్లోవ్స్‌ మారుతాయే తప్ప ధరించడం మానడు.
చెడ్డ బైకర్‌: యాక్సిలరేటర్‌, బ్రేక్‌ల్ని నియంత్రించేవి ఖాళీ చేతులు, చేతి వేళ్లే. లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్లేవాళ్లు అదేపనిగా ఇదే విధానం పాటిస్తే భవిష్యత్తులో ప్రమాదం తప్పదు.

*ప్రత్యేకతమైన దుస్తులు
మంచి బైకర్‌: తీవ్రమైన ఎండ, చలిగాలులు, డీహైడ్రేషన్‌లాంటి రోగాలపై సైతం బైకర్‌ రైడ్‌ చేయాల్సిందే. అందుకే ఒంటికి నిండు చేతుల జాకెట్‌, లేతరంగు ప్యాంట్లు ధరిస్తాడు.
చెడ్డ బైకర్‌: రొటీన్‌గా ధరించే దుస్తులు లేదంటే షార్ట్‌లు, త్రీబైఫోర్‌లు, టీషర్ట్‌లు. ఇతగాడి ప్రాధాన్యం అంతా స్టైల్‌కే.

* బూట్లు
మంచి బైకర్‌: పాదాలు, మడమలు గాయాలపాలు కాకుండా ఉండటానికి టూరులో తప్పకుండా బూట్లు వేసుకోవాలనే సంగతి ఈ రైడర్లకు తెలుసు. లాంగ్‌డ్రైవ్‌ అయినా.. ఓ మోస్తరు ప్రయాణానికైనా వీటిని మర్చిపోరు.
చెడ్డ బైకర్‌: స్లిప్లర్లు, సాండిల్స్‌.. రోజూ వాడే పాదరక్షలే ఆయుధాలు. కాలివేళ్లు చిట్లినా, మడమలపై భారం పడినా డోన్ట్‌కేర్‌ అన్నట్టుంటారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని