స్కూటర్‌కి సెల్ఫ్‌స్టార్ట్‌ ఎలా?
close
Published : 30/03/2018 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్కూటర్‌కి సెల్ఫ్‌స్టార్ట్‌ ఎలా?

మెకానిక్‌ గురూ
స్కూటర్‌కి సెల్ఫ్‌స్టార్ట్‌ ఎలా?

*నా దగ్గర 1986 మోడల్‌ చేతక్‌ స్కూటర్‌ ఉంది. వాహనం పాతదైనా దీన్ని వదులుకోవడం నాతోపాటు మా కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదు. దీనికి సెల్ఫ్‌స్టార్ట్‌ కిట్‌ పెట్టించాలి అనుకుంటున్నాను. అది సాధ్యమవుతుందా? స్కూటర్‌ మంచి కండిషన్‌లో ఉంది. దీనికి ఖర్చు ఎంతవుతుంది?

-  రమణమూర్తి

మీ స్కూటర్‌కి సెల్ఫ్‌స్టార్ట్‌ కిట్‌ పెట్టడం అసాధ్యమేమీ కాదు. అయితే ఎక్కడ, ఎవరు బిగిస్తారని మాత్రం కచ్చితంగా చెప్పలేను. ఈమధ్య బైక్‌లు, స్కూటర్లకు మోడిఫికేషన్‌ పేరుతో అదనపు హంగులు అద్దేలా, కొత్త పార్ట్‌లు బిగిస్తున్నారు. బహుశా అక్కడికెళ్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. లేదా  గతంలో ఈ స్కూటర్లకు పనిచేసిన అనుభవజ్ఞులైన మెకానిక్‌ ఎవరైనా ఉంటే సంప్రదించండి. ఖర్చు విషయానికొస్తే నాలుగైదు వేలల్లోనే మీ పని పూర్తైపోవచ్చు.
* నేను కొద్దిరోజుల కిందట సెకండ్‌ హ్యాండ్‌ కారు కొన్నాను. వాహన గుర్తింపు పత్రం (ఆర్‌సీ) నా పేరు మీద బదిలీ చేయించుకున్నాను. కానీ బీమా మాత్రం నాపేరు మీద బదిలీ చేయించుకోలేదు. ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే బీమా క్లెయిమ్‌ చేసుకోవడం సాధ్యమవుతుందా? కాదా? ఇప్పుడు నేనేం చేయాలి?

- అప్పాళ్ల శ్రీనివాసరావు

మీరు చెబుతున్న వివరాల ప్రకారం ఏ సమయంలో వాహనం ప్రమాదానికి గురైంది అనేదాన్ని బట్టి మీరు క్లెయిమ్‌ చేసుకోగలుగుతారో, లేదో చెప్పొచ్చు. అన్నింటికన్నా ముందు యాభై రూపాయలు చెల్లించి మీరు మీ పేరు మీద బీమా బదిలీ చేయించుకోవచ్చు. ఆ సమయంలో బదిలీ అయిన ఆర్‌సీ నకలు సమర్పించాలి. ఒకవేళ ఆర్‌సీ మీ పేరు మీద బదిలీ అయ్యి, బీమాకు సైతం దరఖాస్తు చేసుకొని ఉంటే ప్రమాద బీమా క్లెయిమ్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకోకపోయినా, బీమా మీ పేరు మీద బదిలీ కాకపోయినా ఎలాంటి ప్రమాద బీమా వర్తించదు. వీలైనంత తొందరగా ఈ ప్రక్రియ పూర్తి చేయండి.

* 2013లో ఇయాన్‌ ఎరా ప్లస్‌ కారు కొన్నాను. 2016 కారుకి యాక్సిడెంట్‌ అవ్వడంతో రిపేరుకిచ్చాను. 15రోజుల తర్వాత డెలివరీ తీసుకున్నాను. అప్పుడు నా కారు డాష్‌బోర్డుపై ఎం.ఎఫ్‌. సింబల్‌ వచ్చింది. వెళ్లి అడిగితే షోరూం వాళ్లు స్కానింగ్‌ చేసి ఇచ్చారు. మళ్లీ ఏదో సమస్య రావడంతో ఓరోజు గట్టిగా నిలదీయడంతో కారులో కాటలిటిక్‌ కన్వర్టర్‌ పోయింది అని చెప్పారు. మార్చాలంటే రూ.35వేలు ఖర్చవుతుందన్నారు. ముందే ఎందుకు చెప్పలేదంటే సమాధానం లేదు. బయట ఒక మెకానిక్‌ దగ్గరికి తీస్కెళ్లి చెక్‌ చేయిస్తే ఓబీడీ 2 సెన్సర్‌ పోయింది అంటున్నారు. ఏది నిజం? ఏది అబద్ధమో తెలియడం లేదు. సర్వీస్‌సెంటర్‌ మోసాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలి? నాకు జరిగిన నష్టానికి బాధ్యులెవరు?

- బి.శ్రీకాంత్‌, ఈమెయిల్‌

సమాధానం రూపంలో మీ సమస్యలన్నింటికీ పరిష్కారం సూచించడం కష్టసాధ్యమైన విషయమే. ఈసీఎం డయాగ్నోస్టిక్‌ అనే పరికరం ద్వారా.. కొన్ని కోడ్‌లను స్కాన్‌ చేసి ఆటోమొబైల్‌ కంపెనీ రూపొందించిన ప్రతి విభాగం పనితీరును అంచనా వేయొచ్చు. లోపాలు కనిపెట్టవచ్చు. మాన్యువల్‌ గైడ్‌ ఆధారంగా ఈసీఎంతో సమస్య ఆ విభాగం తయారీ అప్పుడే ఉందా? తర్వాత వచ్చిందా అన్నది నిర్ధారిస్తారు. ఇవన్నీ తెలుసుకోవాలంటే మీ కంపెనీ అధీకృత వర్క్‌షాప్‌లోకే వెళ్లాల్సి ఉంటుంది

- సాయిభరత్‌ బొప్పరాజు, www.motofix.inమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని