స్పీకర్లకు బై..సంగీతం అదిరెనోయ్‌!
close
Published : 30/03/2018 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్పీకర్లకు బై..సంగీతం అదిరెనోయ్‌!

నయా ట్రెండ్‌
స్పీకర్లకు బై..సంగీతం అదిరెనోయ్‌!

కారు వెనక అద్దంలో సబ్‌వూఫర్‌ సౌండ్‌... విండ్‌షీల్డ్‌, డాష్‌బోర్డ్‌ల్లో అదిరే బీట్‌... డాష్‌బోర్డు, ఏ-పిల్లర్‌.. ఎక్కడైనా మ్యూజిక్కే... స్పీకరు లేకుండానే చెవులు చిల్లులుపడేలా సంగీతం... కాంటినెంటల్‌ తి‘2్చ్మ’ సౌండ్‌ టెక్నాలజీతో ఇది సాధ్యం.  మూడేళ్లలో మన కార్లనీ చుట్టేయబోతోంది.

ఎలా పని చేస్తుంది?

కారులో ఉండే మ్యూజిక్‌ సిస్టమ్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌ని ఆస్వాదించాలంటే స్పీకర్ల నుంచి శబ్దం వెలువడాల్సిందే. కానీ కాంటినెంటల్‌ టెక్నాలజీలో స్పీకర్లకు బదులు యాక్టుయేటర్లు, సూక్ష్మ ట్రాన్స్‌డ్యూసర్లు ఆ పని చేస్తాయి. విద్యుత్తు శక్తిని మెకానికల్‌ శక్తిగా మార్చే సామర్థ్యం ఉండే వీటిని కారు డాష్‌బోర్డు, ఫ్లోర్‌, సీట్‌ ఫ్రేములు, విండ్‌షీల్డ్‌, వెనక అద్దాలు, ఏ-పిల్లర్లలో అమర్చుతారు. కారు ఇంజిన్‌ ఆన్‌ చేయగానే ఆటోమేటిగ్గా ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌తో అనుసంధానమై యాక్టుయేటర్లు ఆ ప్రదేశాల్లో చిన్నగా కదలికలు ప్రారంభిస్తాయి. ట్రాన్స్‌డ్యూసర్ల నుంచి శబ్దం వెలువడుతుంది. దీన్ని త్రీడీ ఇమ్మర్సివ్‌ సౌండ్‌ అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న అత్యాధునిక స్పీకర్లకన్నా మిన్నగా స్పష్టమైన శబ్దం వెలువడుతుంది. మన పక్కనే, కళ్లెదురుగానే ఉన్న అనుభూతికి లోనవుతాం అంటున్నారు. 

ఆవిష్కర్తలెవరు?

  కాంటినెంటల్‌ అనే జర్మన్‌ ఆటోమొబైల్‌ పరికరాల తయారీ సంస్థ. డోమినిక్‌ హాఫీలే అనే నిపుణుడు సారథ్యం వహించాడు. ఇప్పటికే మెర్సిడెస్‌ బెంజ్‌ సీ క్లాస్‌ కారులో ప్రయోగాత్మకంగా వాడి చూశారు. బీఎండబ్ల్యూ, ఆడీ కంపెనీలతో చర్చలు నడుస్తున్నాయి. ఇంకో మూడేళ్లలో అన్ని ఆటోమొబైల్‌ కంపెనీలు మా టెక్నాలజీనే ఉపయోగిస్తారు అని నమ్మకంగా చెబుతున్నారు. 

మరమ్మతుల మాటేంటి?

పొరపాటున కారు ఏదైనా ప్రమాదానికి గురైతే, ట్రాన్స్‌డ్యూసర్లు చెడిపోతే శబ్దానికి వచ్చిన నష్టం ఏమీ ఉండదుగానీ నాణ్యత మాత్రం దెబ్బతింటుంది. మళ్లీ అంతే వినసొంపైన శబ్దం వినాలంటే ప్రమాదానికి గురైన ఏ-పిల్లర్‌, విండ్‌షీల్డ్‌లు మార్చుకోక తప్పదు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని