దీర్ఘకాలిక బీమా మంచిదేనా?
close
Published : 01/06/2018 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీర్ఘకాలిక బీమా మంచిదేనా?

వాహన సురక్ష
దీర్ఘకాలిక బీమా మంచిదేనా?

కార్లు, ద్విచక్రవాహనాలకు మూడు, ఐదేళ్లపాటు బీమా ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని ఈమధ్య పత్రికల్లో చదివాను. ఈ వార్తలు నిజమేనా? దీర్ఘకాలిక బీమాతో లాభమా? నష్టమా?

- శ్రీనివాసరావు, తెనాలి

ప్రస్తుతానికి అలాంటి నియమం ఏదీ లేదు. అయితే భవిష్యత్తులో దీనిని చట్టంగా రూపొందించడం గురించి చర్చలు జరుగుతున్నాయి. మూడేళ్ల దీర్ఘకాలిక బీమా ద్విచక్రవాహనదారులకు ఇప్పటికే అందుబాటులో ఉంది. దీర్ఘకాలిక బీమాతో చాలా ప్రయోజనాలు ఉంటాయి. మొదటిది ప్రతి సంవత్సరం పాలసీని పునరుద్ధరించాల్సిన పనిలేదు. ఇది మీ మోటార్‌ బీమా పాలసీ పునరుద్ధరణలో ఆలస్యం కావడం లేదా మర్చిపోవడం వల్ల ఇబ్బంది పడకుండా కాపాడుతుంది. రెండోది ఏడాది బీమా ప్రీమియం కన్నా దీర్ఘకాలిక బీమా ప్రీమియం తక్కువగా ఉంటుంది. చివరగా దీర్ఘకాలిక బీమాతో మీరు పాలసీ కాల పరిమితిలోపు ఒక నిర్దిష్ట మొత్తం వరకు క్లెయిం చేసుకున్నా నో క్లెయిం బోనస్‌ కోల్పోరు. తేలికగా చెప్పాలంటే ఒక సంవత్సరం పాలసీలో ఒక క్లెయిమ్‌ దాఖలు చేస్తే నో క్లెయిమ్‌ బోనస్‌ కోల్పోతారు. మూడేళ్లలో మూడు క్లెయిమ్‌లు దాఖలు చేస్తే ఎన్‌సీబీ కోల్పోతారు. కానీ మూడేళ్లలో మూడు క్లెయిమ్‌ల సంభావ్యత ఏడాదిలో ఒక క్లెయిమ్‌ కంటే తక్కువగా ఉంటుంది. ఇది దీర్ఘకాల బీమా పాలసీని ప్రామాణిక ఒక సంవత్సరం పాలసీ కన్నా మెరుగ్గా మారుస్తుంది.

- సజ్జా ప్రవీణ్‌చౌదరి, మోటార్‌ ఇన్సూరెన్స్‌ హెడ్‌: పాలసీబజార్‌

Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని