వానాకాలం.. వైపర్లు పదిలం!
close
Published : 31/08/2018 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వానాకాలం.. వైపర్లు పదిలం!

వానాకాలం.. వైపర్లు పదిలం!

వర్షం పడుతున్నపుడు కారులో ప్రయాణిస్తుంటే వైపర్ల వాడకం తప్పనిసరి. ముందు అద్దాలకు ఆవలివైపు ఏం ఉందో స్పష్టంగా కనిపించాలన్నా, ప్రమాదాలు తప్పాలన్నా వైపర్‌ బ్లేడ్‌లు సరిగ్గా పని చేయాల్సిందే. అందుకు మన నిర్వహణ ఎలా ఉండాలంటే.

* సాధారణంగా ఆర్నెళ్లకోసారి వైపర్లు మార్చాలంటారు నిపుణులు. వీటి ఆయుఃకాలం మరింత పెరగాలంటే నిర్వహణ బాగుండాలి. వీటిపై ఎక్కువ నీళ్లు పడ్డా, ఎక్కువ సమయం ఎండలో ఉంచినా సిలికాన్‌ బ్లేడ్లలో పగుళ్లు ఏర్పడతాయి. చిరిగిపోతాయి. రంగు మారిపోతుంటుంది.

* వైపర్‌ ఆర్మ్‌ కిందిభాగంలో ఎక్కువ దుమ్ము, ధూళి పేరుకుపోతుంది. వైపర్లు కిందికి, పైకి కదిలినపుడు విండ్‌షీల్డ్‌ ఉపరితలంపై మరకలు పడతాయి. నెలకోసారైనా ఈ దుమ్మును, మడ్డిలాంటి వ్యర్థాలను శుభ్రం చేయాలి.

* వెనిగర్‌ వైపర్‌ బ్లేడ్‌లను బాగా శుభ్రం చేస్తుంది. ముందు మామూలు గుడ్డతో వీటిని తుడవాలి. తర్వాత పరిశుభ్రమైన గుడ్డముక్క తీసుకొని వెనిగర్‌లో కొద్దిగా ముంచి దాంతో శుభ్రం చేయాలి. మరకలు కలిగించే వ్యర్థాలు మాయమవడమే కాదు.. ప్రొటెక్టివ్‌ కోట్‌ సిద్ధమైనట్టే.

* వెనిగర్‌తో శుభ్రం చేశాక బ్లేడ్స్‌కి సరిపోయే రబ్బర్‌ ప్రొటెక్టంట్స్‌ తొడగాలి. మార్కెట్లో రకరకాల బ్రాండ్లు దొరుకుతున్నాయి. సరైన సైజువి ఎంచుకోవాలి. ధర కాస్త ఎక్కువైనా మంచి నాణ్యత ఉండే సిలికాన్‌ రబ్బర్‌ వైపర్‌ బ్లేడ్‌లు కొనుక్కుంటే జీవితకాలం ఎక్కువగా ఉంటుంది.

* విండ్‌షీల్డ్‌తో వైపర్ల అనుసంధానం సరిగా ఉండాలి. ఇవి కిందికిపైకి కదిలినపుడు ఎక్కువ శబ్దం వచ్చినా, కదలకుండా ఒకేచోట బిగుసుకుపోయినా, తేలిగ్గా జారిపోయినా, ఫ్రేమ్‌ పగిలిపోయినా, జాయింట్లు దగ్గర కనెక్షన్‌ సరిగాలేకపోయినా, లోహ భాగాల దగ్గర తుప్పు పట్టినా వీటిని మార్చాల్సిన సమయం వచ్చిందని అర్థం.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని