రెయిజ్‌ చేస్తే బండి ఆగిపోతోంది
close
Published : 21/09/2018 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెయిజ్‌ చేస్తే బండి ఆగిపోతోంది

మెకానిక్‌గురూ
రెయిజ్‌ చేస్తే బండి ఆగిపోతోంది

* నేను 2014 మోడల్‌ పల్సర్‌ 150 బైక్‌ వాడుతున్నాను. ఈమధ్యే షోరూంలో సర్వీసింగ్‌కి ఇచ్చిననుంచి పికప్‌ పడిపోయింది. వేరే మెకానిక్‌కి చూపిస్తే క్లచ్‌ప్లేట్లు పోయాయి అన్నాడు. వేయించాను. మళ్లీ అదే సమస్య వస్తే ఇంకో మెకానిక్‌ దగ్గరికి వెళ్తే బుషెస్‌ పోయాయి అన్నాడు. తర్వాత మైలేజీ కూడా పడిపోయింది. పైగా ఇంజిన్‌లో ఏదో సౌండ్‌ వస్తోంది. ఏం చేయమంటారు.

- సుమన్‌రెడ్డి, మియాపూర్‌

క్లచ్‌ప్లేట్లు, బుష్‌లు మార్చామంటున్నారు. బహుశా ఏదైనా ఎలక్ట్రికల్‌ సమస్య ఉండి ఉంటుంది. కాయిల్‌, కేబుళ్లు, స్పార్క్‌ప్లగ్‌లు కూడా ఓసారి పరిశీలించండి. వీటిలో సమస్య ఉంటేనే పికప్‌ తగ్గిపోతుంది. మంచి అనుభవజ్ఞుడైన మెకానిక్‌ని సంప్రదించండి.



* నాలుగేళ్ల కిందట బైక్‌ కొన్నాను. సమస్య ఏమిటంటే.. వేగంగా వెళ్తున్నపుడు ఏదైనా అడ్డువచ్చి సడెన్‌ బ్రేక్‌ వేసి మళ్లీ యాక్సిలేటర్‌ రెయిజ్‌ చేస్తే ఇంజిన్‌ ఆఫ్‌ చేసినట్టు బండి వెంటనే ఆగిపోతోంది. అదే మెల్లిగా రెయిజ్‌ చేస్తే మాత్రం స్పీడ్‌ అందుకుంటోంది. ఎందుకిలా?

- నరేశ్‌, వరంగల్‌

మీరు చెప్పిన వివరాల ప్రకారం కార్బురేటర్‌లో ఏదో సమస్య ఉండి ఉంటుంది. దీని కారణంగానే బండి అకస్మాత్తుగా ఆగిపోతోంది. దగ్గర్లో ఉన్న ఏదైనా మెకానిక్‌ షాప్‌లో చూపించండి.


- సాయిభరత్‌ బొప్పరాజు, ‌www.motofix.com

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని