పేదరికంపై పంచ్‌
close
Published : 29/03/2016 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేదరికంపై పంచ్‌

పేదరికంపై పంచ్‌

రకొర సౌకర్యాలున్నా.. వెనక్కి తగ్గలేదా అమ్మాయిలు! పేదరికాన్ని మరిచిపోయి ఆటలో ఆనందాన్ని వెతుక్కున్నారు. ఆ సానుకూల ధోరణే బాక్సింగ్‌లో వారికి బంగారు పతకాలు తెచ్చిపెడుతోంది. ఒలింపిక్స్‌ దిశగా నడిపిస్తోంది. అయితే ఆ పిల్లలు సాధించిన విజయం వెనక చెన్నైకి చెందిన 23 ఏళ్ల నర్మద కృషి ఎంతో ఉంది. స్థానికంగా అంతా బాక్సింగ్‌ క్వీన్‌ అని పిలిచే నర్మద రాష్ట్రస్థాయి ఛాంపియన్‌గా రాణించింది. తనొక్కతే విజయాన్ని ఆస్వాదించడంలో గొప్పేం ఉంది? తనకు వచ్చిన విద్యను పదిమందికి పంచాలని అనుకుంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఆటల్లో అడుగుపెడితే ఆత్మవిశ్వాసం పెంచుకుంటారనేది నర్మద నమ్మకం. అందుకే చెన్నై కన్నగినగర్‌లో ఆడపిల్లలకు ఉచితంగా బాక్సింగ్‌ విద్యను నేర్పించడం మొదలుపెట్టింది. అయితే ఆ ఆట నేర్చుకోవడానికి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించుకోలేని పరిస్థితి ఆ అమ్మాయిలది. ఒక బాక్సింగ్‌ గ్లౌస్‌నే 35 మంది అమ్మాయిలు పంచుకునేవారు. పిడిగుద్దులు విసిరేందుకు అవసరం అయిన పంచింగ్‌ బ్యాగ్‌కానీ, రింక్‌ కానీ లేవు. కేవలం ఇంట్లో అందుబాటులో ఉండే జావనే అత్యంత ఇష్టంగానే తాగేవారు. ఎప్పుడైనా గుడ్డు దొరికితే అదే గొప్పగా భావించేవారు. నర్మద కూడా ఓ జిమ్‌లో ఉదయంపూట శిక్షకురాలిగా పనిచేసి ఈ పిల్లలకు సౌకర్యాలు కల్పించేది. అలా సాధన చేసి కేవలం నాలుగునెలల్లోనే వివిధ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. ఇంతకు ముందు వరకూ నర్మద మాత్రమే కోచింగ్‌ ఇచ్చేది. ఇప్పుడు ఆమె దగ్గర బాక్సింగ్‌ నేర్చుకున్న అమ్మాయిలూ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి అక్కడ బాలికలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని