మెరిపించే టొమాటోలు
close
Published : 06/04/2016 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెరిపించే టొమాటోలు

సోయగం
మెరిపించే టొమాటోలు

ఎర్రెర్రని టొమాటోలు అందాన్ని కాపాడుకోవడంలోనూ కీలకంగా పనిచేస్తాయి. మరి దాన్ని ఎలా ఉపయోగించాలి.. వాటితో ఎలాంటి సౌందర్య ప్రయోజనాలున్నాయి.. చూద్దాం రండి.

ఎండలో తిరగడం, దుమ్ము ధూళి వంటి కారణాల వల్ల పాతికేళ్ల అమ్మాయిలైనా అసలు వయసుకంటే పెద్దవారిలా కనిపిస్తుంటారు. ఈ సమస్యను దూరం చేసుకోవడానికి ఇలా చేసి చూడండి. ఒక టొమాటోని గుజ్జుగా చేసుకుని దానికి రెండు చెంచాల పంచదార కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మృదువుగా మర్దన చేస్తే చర్మం మృతకణాలు తొలగి మృదువుగా కనిపిస్తుంది. తగిన ఆక్సిజన్‌ అంది ముడతలు పడకుండా కాపాడుతుంది. 

* కాస్త రంగు తక్కువగా ఉన్నామనుకుని బాధపడే అమ్మాయిలకు చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది టొమాటో. పావుకప్పు టొమాటో గుజ్జులో చెంచా తేనె కలిపి ముఖానికి సవ్య, అపసవ్య దిశల్లో మృదువుగా మర్దన చేయాలి. ఆపై ఒక టొమాటోని మెత్తగా చేసి దానికి ఒక గుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలకొట్టాలి. దీన్ని రోజూ ఉదయాన్నే ముఖానికి పూతలా వేస్తే మీరు కోరుకున్న ఫలితం అందుతుంది.

* టొమాటో గుజ్జుని ఐస్‌ట్రేలో వేసి ఉదయాన్నే ఫ్రీజర్‌లో పెట్టాలి. ఎండలోనుంచి ఇంటికి తిరిగిరాగానే ఐస్‌ క్యూబ్స్‌తో మృదువుగా మర్దన చేస్తే తక్షణ సాంత్వన లభిస్తుంది. టొమాటోలోని లైకోపీన్‌ సూర్యుడి నుంచి వెలువడే హానికారక కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

* ఒక టొమాటోను మెత్తగా చేసుకుని దానికి చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆపై మునివేళ్లతో మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా పదినిమిషాలు చేశాక కాసేపు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో ముఖం కడిగేసుకుంటే చర్మం కాంతిమంతంగా మారుతుంది. పొడిచర్మ ఉన్నవారు కాస్త తేనె కూడా చేర్చుకుంటే సరి చక్కని ఫలితం ఉంటుంది.

* టొమాటో గుజ్జు, కమలాఫలం, కీరదోస రసాల్ని సమాన పరిమాణంలో తీసుకుని బాగా కలిపి రాత్రిపూట రాసుకుని ఆరగంట ఆరనిచ్చి కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల పిగ్మెంటేషన్‌ సమస్య దూరమవుతుంది. ఛాయ మెరుగవుతుంది. చర్మ గ్రంథులూ శుభ్రపడతాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని