లైంగిక విజ్ఞానం అందిస్తున్నారు!
close
Published : 12/04/2016 02:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లైంగిక విజ్ఞానం అందిస్తున్నారు!

లైంగిక విజ్ఞానం అందిస్తున్నారు!

ఇంట్లో ఉన్నంత సేపూ మనం మన చిన్నారులని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కానీ ఒక్కసారి వాళ్లు గడపదాటగానే భయపడిపోతుంటాం. అందుకే పిల్లలు ఆపదలో తమను తాము రక్షించుకునేలా చేస్తున్నారు ఐఐటీ కాన్పూర్‌ విద్యార్థినులు. ముఖ్యంగా పిల్లలు లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండాలంటే వారికి లైంగిక విషయాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. టీచర్లు పిల్లలకు ఇలాంటి విషయాలు తేలిగ్గా బోధించేందుకు వీలుగా ప్రత్యేక కిట్‌రూపొందించారు. మనదేశంలో 46శాతం మంది పిల్లలు తమపై లైంగిక పరమైన వేధింపులు జరుగుతున్నా నోరు విప్పడం లేదట. ఆ చేదునిజమే ఈ కిట్‌ని రూపొందించడానికి మూల కారణం అంటున్నారీ ఐఐటీ విద్యార్థినులు. జుమ్కీ అయ్యంగార్‌, మిథాలీబాసిన్‌, స్నేహాపర్హీ, స్వయంసిద్ధపాణిగ్రాహీ వీటి రూపకర్తలు. ఏది చెడు స్పర్శ, ఏది ఆత్మీయ స్పర్శో తెలుసుకునేవిధంగా దీన్ని రూపొందించారు. ఈ కిట్‌లో ఎరుపూ, నీలం, పసుపు రంగుల్లో ఉండే కార్డులు పిల్లలకు అవసరం అయిన సమాచారాన్ని అందవేస్తాయి. ఎనిమిది నుంచి పన్నెండేళ్ల పిల్లల కోసం వీటిని రూపొందించారు. తల్లిదండ్రులూ, మానసిక నిపుణులూ, టీచర్లూ.. మురికివాడల్లోని ప్రజల అభిప్రాయాలని తీసుకుని సుదీర్ఘకాలం కష్టపడి ఈ కిట్‌ని రూపొందించామంటున్నారు విద్యార్థినులు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని