నాజూగ్గా.. తీరుగా
close
Published : 24/04/2016 02:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాజూగ్గా.. తీరుగా

నాజూగ్గా.. తీరుగా

కొంతమందికి నడుం కింద భాగం నుంచీ కొవ్వు ఎక్కువగా పేరుకుంటుంది. హిప్స్‌, తొడలూ, కాళ్ల దగ్గర కొవ్వు పేరుకుని చూడ్డానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ స్ట్రెచెస్‌ని చేయడం వల్ల అక్కడ పేరుకున్న కొవ్వు తగ్గి తీరైన ఆకృతిని పొందవచ్చు..

 

 

స్ట్రెచ్‌1

 

 

 

 

 నిలబడి రెండు చేతులూ పైకి పెట్టి ముందుకు వంగాలి. రెండు చేతులూ రెండు పాదాల దగ్గర పెట్టుకుని కాళ్లని వెనక్కి పెట్టాలి. ఇప్పుడు కుడికాలిని వెనక్కి ఉంచి పైకి లేపాలి. నెమ్మదిగా ఎడమ కాలుని కింద పెట్టాలి. ఇదే విధంగా ఎడమకాలి వైపు కూడా చేయాలి. ఇలా మార్చిమార్చి పది నుంచి ఇరవై సార్లు చేయాలి. నడుం దగ్గర నుంచి అన్ని అవయవాలకు వ్యాయామం అంది కొవ్వు తగ్గుతుంది.


స్ట్రెచ్‌2

  ముందుగా వజ్రాసనంలో కూర్చుని రెండు చేతులూ ముందుకు పెట్టి.. మెల్లగా మోకాళ్లని పైకి లేపాలి. రెండు పాదాల మధ్య కొద్దిగా దూరం ఉండాలి. ఆ భంగమ నుంచి ఒక కాలుని ముందుకు కొద్దిగా వంచి వేగంతో జంప్‌ చేసినట్టుగా చేయాలి. ఇప్పుడా కాలుని వెనక్కిపెట్టి మరొక కాలుని మళ్లీ జంప్‌ చేసినట్టుగా చేయాలి.చూడ్డానికి సైకిల్‌ తొక్కుతున్నట్టుగా ఉంటుంది. ఇలా పదిసార్లు చేయాలి. ఇలా వెంటనే వెంటనే చేయడం వల్ల పిరుదులూ, తొడల దగ్గరి కొవ్వు తగ్గుతుంది.


స్ట్రెచ్‌3

  మోకాళ్లపైన కూర్చుని కుడికాలిని వెనక్కి పెట్టి ఎడమమోకాలు 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. రెండు చేతులూ పైకి తీసుకొచ్చి నమస్కార ముద్రలో ఉంచాలి. తలనీ, చేతులనీ స్ట్రెచ్‌ చేసి ఉంచాలి. అరనిమిషం తర్వాత రెండు చేతులూ కింద పెట్టి.. ఈ సారి ముందున్న కాలిని వెనక్కీ వెనక కాలుని ముందుకీ తీసుకురావాలి. భుజాలూ, చేతుల్లో ఉండే కొవ్వునీ తగ్గిస్తుంది.

 


అరుణ
యోగా నిపుణురాలు
9440698003


 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని