ఆగస్టు 10న... ‘మీ వద్దకే పీఎఫ్‌’
close
Updated : 30/07/2021 06:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆగస్టు 10న... ‘మీ వద్దకే పీఎఫ్‌’

కరాస, న్యూస్‌టుడే : భవిష్యనిధి ఖాతాదారులు, పింఛనుదారులు, వివిధ సంస్థల యజమానులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ఆగస్టు 10న ‘మీ వద్దకే పీఎఫ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విశాఖపట్నం సహాయ భవిష్యనిధి కార్యాలయ కమిషనర్‌ అబ్దుల్‌ఖాదిర్‌ గురువారం తెలిపారు. మర్రిపాలెం ప్రాంతీయ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. లేఖలు పంపే పోస్టల్‌ కవర్‌పై ‘నిధి ఆప్కీ నికత్‌’ అని రాయాలన్నారు. ఆగస్టు 6 లోపు విశాఖపట్నం ప్రాంతీయ భవిష్యనిధి కార్యాలయం, మర్రిపాలెం చిరునామాకు పంపాలన్నారు. 0891-2558734 నంబకు ఫ్యాక్స్‌ గాని, vizag@epfindia.gov.in లో గానీ పంపొచ్చని తెలిపారు.


మళ్లీ పదవుల పందేరం

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సంస్థ (డీసీఎంఎస్‌)లకు సంబంధించి ఆరుగురి చొప్పున నాన్‌ అఫీషియో కమిటీ సభ్యులుగా గురువారం ప్రభుత్వం నియమించింది. గతంలో పర్సన్‌ ఇన్‌ఛార్జి కమిటీ సభ్యులుగా ఉన్నవారిలో కొంతమందికి తాజా కమిటీలోనూ చోటివ్వగా, మరికొందరు కొత్త వారికి సభ్యులుగా అవకాశం కల్పించారు. ఛైర్‌పర్సన్‌తో సహా ఏడుగురు సభ్యులతో కూడిన ఈ నాన్‌ అఫీషియో కమిటీ బాధ్యతల స్వీకరించినప్పటి నుంచి ఆరు నెలల పాటు మనుగడలో ఉంటుంది. డీసీసీబీ ఛైర్‌పర్సన్‌గా చింతకాయల అనితను నియమిస్తూ ఇదివరకే ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా సహకార మార్కెటింగ్‌ సంస్థ ఛైర్‌పర్సన్‌గా గాజువాకకు చెందిన పల్లా చినతల్లి నియమించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని