ఆ ‘కసరత్తు’ వెనుక మనోడే
close
Updated : 30/07/2021 11:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ‘కసరత్తు’ వెనుక మనోడే

మీరాబాయి చాను మసాజర్‌గా విజయవాడ వాసి కందుకూరి కోటేశ్వరరావు

న్యూస్‌టుడే-విజయవాడ క్రీడలు

టోక్యో ఒలింపిక్స్‌లో మణిపూర్‌కు చెందిన మీరాబాయి ఛాను ఒలింపిక్స్‌లో దేశానికి రజత పతకాన్ని అందించి, అందరినీ ఆనందంలో ముంచెత్తింది. ఆమె విజయం వెనుక మన బెజవాడ వాసి కూడా ఉన్నారు మసాజర్‌గా విధులు నిర్వర్తిస్తూ, ఆటలో సహాయకునిగా, ప్రత్యేక పోషకాహారాన్ని అందించే సమయంలో వంటవానిగా.. ఇలా అన్ని విధాలుగా తన పూర్తి సహకారాన్ని అందించాడు కందుకూరి వీర కోటేశ్వరరావు.

*● విజయవాడ రైల్వే స్టేషన్‌లో రిజర్వేషన్‌ సూపర్‌వైజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కోటేశ్వరరావు స్వతహాగా వెయిట్‌ లిఫ్టర్‌. స్పోర్ట్స్‌ కోటాలో 2006లో ఉద్యోగం సాధించాడు. జాతీయ, ఆలిండియా రైల్వే వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో కండరాలు సడలింపు కోసం ఫిజియోథెరఫిస్ట్‌ శ్రీహరి వద్ద మసాజ్‌ చేయడం నేర్చుకున్నాడు. ఇదే క్రమంలో 2016, 2017లో ముంబయిలో జరిగిన భారత రైల్వే వెయిట్‌ లిఫ్టింగ్‌ జట్టు శిక్షణ శిబిరంలో.. ఫిజియోగా, మసాజర్‌గా వ్యవహరించాడు. ఇండియన్‌ రైల్వేస్‌ జట్టు కోచ్‌, ప్రస్తుత భారత వెయిట్‌ లిఫ్టింగ్‌ జట్టు చీఫ్‌ కోచ్‌, ద్రోణాచార్య అవార్డీ విజయ శర్మ దృష్టిని ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో కోటేశ్వరరావును భారత వెయిట్‌ లిఫ్టింగ్‌ జట్టుకు మసాజర్‌గా నియమిస్తూ ఇండియన్‌ రైల్వే స్పోర్ట్స్‌ బోర్డు నుంచి ఆదేశాలు అందాయి. 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత లిఫ్టర్లకు మసాజర్‌గా నియమితులయ్యాడు. ఈ పోటీల్లో ఎన్నడూ లేని విధంగా అయిదు పసిడి, రెండు రజత, ఒక కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు భారత లిఫ్టర్లు. పతకాలు సాధించిన వారిలో మీరాబాయి ఛాను, సతీష్‌ శివలింగం, రాగాల రాహుల్‌, వికాస్‌ ఠాగూర్‌, ప్రదీప్‌ సింగ్‌, లాతూర్‌, గురు రాజ, సంజితా ఛాను, పూనమ్‌ యాదవ్‌ వంటి వారు ఉన్నారు. అప్పటి నుంచి చీఫ్‌ కోచ్‌ విజయ శర్మ.. కోటేశ్వరరావును ప్రతి అంతర్జాతీయ టోర్నీకి లిఫ్టర్లకు సపోర్టర్‌గా, మసాజర్‌గా తీసుకెళ్లేవారు.

గడిచిన ఎనిమిది నెలలుగా కుటుంబానికి దూరంగా ఉంటూ.. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్టుకు జరిగిన శిక్షణ శిబిరంలో లిఫ్టర్లకు అండగా, మసాజర్‌గా వ్యవహరించాడు. 2018లో మీరాబాయి ఛాను కామన్వెల్త్‌ గేమ్స్‌లో పసిడి పతకం కైవసం చేసుకుంది. అప్పటి నుంచి మీరా.. కోటేశ్వరరావును అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచేది. కోటేశ్వరరావు స్వతహాగా లిఫ్టర్‌ కావడంతో మీరా ప్రాక్టీసు సమయంలో కూడా దగ్గరుండి వెయిట్స్‌ లోడ్‌ చేయడం, అన్‌ లోడ్‌ చేయడం వంటివి కూడా చూసుకునేవాడు. ప్రాక్టీసు ముగిసిన తర్వాత ఆమె దేహాన్ని రిలాక్స్‌ చేసేవాడు. చాను తీసుకునే ఆహారంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎటువంటి డోపింగ్‌ బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన ఆహారాన్ని అందించేవాడు. బయటకెళ్లి ఏది కొనుగోలు చేయాలన్నా మీరా వెంట కోటేశ్వరరావు తప్పక ఉండేవాడు.

మీరాకు సాల్మన్‌ ఫిష్‌ అంటే బాగా ఇష్టమంటున్నాడు కోటేశ్వరరావు. దక్షిణాది వంటకాలు, మాంసాహారం వడిపెట్టానన్నారాయన..


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని