చిరుబొద్దిలో క్యాన్సర్‌ నియంత్రణ గుణం!
close
Updated : 26/09/2021 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరుబొద్దిలో క్యాన్సర్‌ నియంత్రణ గుణం!

గుర్తించిన మంగళూరు విశ్వవిద్యాలయ బృందం

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: చిరుబొద్ది మొక్కల్లో క్యాన్సర్‌ను నియంత్రించే ఔషధ గుణాలు ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటకలోని మంగళూరు విశ్వవిద్యాలయం అప్లైడ్‌ బోటనీ విభాగం చేపట్టిన అధ్యయనంలో ఈ అంశం వెల్లడైంది. ఈ మొక్కలో క్యాన్సర్‌ నివారణ ఔషధంలో ఉపయోగించే టెట్రాండ్రైన్‌ ఆల్కలాయిడ్‌లు ఉన్నాయి. ఈ మొక్క శుద్ధీకరణ ప్రక్రియకు భారతీయ మేధోహక్కుల సంస్థ (ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ ఇండియా) నుంచి మంగళూరు వర్సిటీకి అనుమతి లభించింది. మొక్కల్లో టెట్రాండ్రైన్‌ ఆల్కలాయిడ్‌ల గుర్తింపు ప్రక్రియను ముందుగా చైనా చేపట్టారు. అక్కడ స్టెఫానియా, టెట్రాండ్ర మొక్కల్లో క్యాన్సర్‌ నియంత్రణ ఔషధ గుణాలను గుర్తించారు. భారత్‌లో ఈ అరుదైన ఆల్కలాయిడ్‌లను గుర్తించింది మంగళూరు విశ్వవిద్యాలయం మాత్రమే. చైనాలో టెట్రాండ్రైన్‌ శుద్ధీకరణ ప్రక్రియ ప్రగతిలో ఉండగా, ఇంకా ఔషధాన్ని తయారు చేయలేదు. భారత్‌లో ఔషధ కంపెనీలు లేదంటే ఆత్మనిర్భర్‌ ద్వారా నిధులు అందితే చైనా కంటే ముందుగా ఔషధాన్ని తయారు చేసే వీలుందని ఈ అధ్యయన బాధ్యులు డా.కె.ఆర్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. ఇప్పటి వరకు టెట్రాండ్రైన్‌ను క్లినికల్‌ ఐసొలేషన్‌ ద్వారానే తయారు చేసేవారు. ఇందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొక్కల నుంచి సేకరిస్తే తక్కువ వ్యయంతో పాటు ప్రామాణిక ఔషధం కూడా తయారు చేయవచ్చని ఈ అధ్యయన సభ్యుల్లో ఒకరైన డా.ఎన్‌.భాగ్య వెల్లడించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని