Lockdown: కట్టడి వేళ... ప్రయాణాలిలా
close
Updated : 25/05/2021 07:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lockdown: కట్టడి వేళ... ప్రయాణాలిలా

ఏపీ సహా పొరుగు రాష్ట్రాల్లో ఈ-పాస్‌ నిబంధనలు వెల్లడించిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

ఈనాడు, అమరావతి: కొవిడ్‌ కట్టడిలో భాగంగా వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని... ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు, ఆయా రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చేవారు ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఈ-పాస్‌ లేకుండా ప్రయాణించి సరిహద్దుల వద్ద ఇబ్బందులు ఎదుర్కోవద్దని సూచించారు. పొరుగు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ-పాస్‌ నిబంధనల్ని ఆయన వివరించారు. ఈ మేరకు సోమవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులోని ప్రధానాంశాలు...
ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాలనుకునేవారు: ఏపీలో ఉదయం 6-12 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉంది. ఆ వ్యవధిలో ఏపీ భూభాగంలోకి ప్రవేశించి.. వారి గమ్యస్థానానికి చేరుకోగలిగితే ఎలాంటి ఈ-పాస్‌ అవసరం లేదు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏపీలోకి రావాలంటే మాత్రం అనుమతి తప్పనిసరి. అంబులెన్సులు, కర్ఫ్యూ నుంచి మినహాయింపు పొందిన అత్యవసర సేవల వాహనాలు, సిబ్బందికి మాత్రం ఎలాంటి ఈ-పాస్‌ అవసరం లేదు.
ఏపీలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించాలంటే: ఉదయం 6-12 గంటల మధ్య ప్రయాణించేవారికి ఎలాంటి ఈ-పాస్‌ అక్కర్లేదు. ఆ సమయం కాకుండా మిగతా సమయాల్లో ప్రయాణించాలనుకుంటే మాత్రం పాస్‌ తప్పనిసరి. అన్ని ధ్రువపత్రాలతో వారు దరఖాస్తు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖకు సంబంధించిన 
appolice.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో కోరిన వివరాలన్నీ పొందుపరిస్తే దరఖాస్తుదారు వాట్సాప్‌ నెంబర్‌కు, మెయిల్‌ ఐడీకి నేరుగా పాస్‌ను పంపిస్తారు.
ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలంటే: ఆ రాష్ట్ర భూభాగంలోకి ఏ సమయంలో వెళ్లాలన్నా సరే తెలంగాణ పోలీసు శాఖ నుంచి ఈ-పాస్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. 
policeportal.tspolice.gov.in పోర్టల్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఈ- పాస్‌ పొందిన తర్వాతే ప్రయాణం చేయాలి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని