రెండు డోసులతో 94% యాంటీబాడీలు
close
Published : 24/07/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండు డోసులతో 94% యాంటీబాడీలు

తెలంగాణలో 60% మందికి కరోనా నిరోధక శక్తి
  ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌ సీరో సర్వే
  వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచన

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారికి 94 శాతం యాంటీబాడీలు సమకూరాయని భారతీయ వైద్య పరిశోధన మండలి - జాతీయ పోషకాహార సంస్థ(ఐసీఎంఆర్‌ - ఎన్‌ఐఎన్‌) సీరో సర్వేలో వెల్లడైంది. యాంటీబాడీల వ్యవస్థ ఎంత వరకు సమకూరిందనే విషయమై తాజాగా జరిపిన నాలుగో సర్వే ఫలితాలను ఎన్‌ఐఎన్‌ శుక్రవారం విడుదల చేసింది. ఒక్క డోసు తీసుకున్న వారిలో 78.5 శాతం యాంటీబాడీలు వృద్ధి చెందాయని సర్వే తెలిపింది. ఇలా తెలంగాణలో మొత్తమ్మీద 60.01 శాతం మందిలో యాంటీబాడీలు సమకూరాయని ఎన్‌ఐఎన్‌ పేర్కొంది. త్వరగా అందరూ వ్యాక్సిన్‌ వేసుకునేలా ప్రభుత్వ యంత్రాంగం ప్రోత్సహించాలని ఈ సర్వేలు సూచిస్తున్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఎన్‌ఐఎన్‌ ప్రజారోగ్య విభాగం అధిపతి ఎ.లక్ష్మయ్య తెలిపారు.
*ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన నాలుగో విడత సర్వేలో తొలిసారిగా 6-9 ఏళ్ల చిన్నారులను పరీక్షించామని.. 55 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించామని లక్ష్మయ్య తెలిపారు. యుక్తవయసువారికి 61 శాతం యాంటీబాడీలు సమకూరాయన్నారు.

ఆ మూడు జిల్లాల్లోనే నాలుగు విడతలు..

2020లో మూడు సార్లు.. 2021 జూన్‌లో నాలుగో సారి తెలంగాణలోని జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఇలా నాలుగు విడతలు అవే ప్రాంతాల్లో నిర్వహించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి సమకూరుతున్న తీరును కచ్చితంగా అంచనా వేయడానికి వీలు చిక్కిందని ఎన్‌ఐఎన్‌ పేర్కొంది. 2020 మేలో 0.33 శాతం, ఆగస్టులో 12.2 శాతం, డిసెంబరులో 24.1 శాతం మందికి యాంటీబాడీలు సమకూరినట్లు వెల్లడైంది. 2020 డిసెంబరులో జాతీయ స్థాయిలో 24 శాతం మందిలో యాంటీబాడీలుండగా.. 2021 జూన్‌లో నిర్వహించిన నాలుగో విడతలో ఈ శాతం 67కు చేరింది. రాష్ట్రం విషయానికొస్తే ఇదే కాలపరిమితిలో 24.1 శాతం నుంచి 60.1 శాతానికి యాంటీబాడీల స్థాయి పెరిగింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని