జూకంటికి సినారె పురస్కారం
close
Published : 30/07/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జూకంటికి సినారె పురస్కారం

ప్రదానం చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి

నారాయణగూడ, న్యూస్‌టుడే: సిరిసిల్లకు చెందిన ప్రముఖ కవి జూకంటి జగన్నాథానికి సినారె సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. గురువారం చారిత్రక తెలంగాణ సారస్వత పరిషత్తు, సుశీలానారాయణరెడ్డి ట్రస్టుల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పరిషత్తు ప్రాంగణంలో జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత, మహాకవి డా.సి.నారాయణరెడ్డి 90వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినారె సాహితీ పురస్కారానికి ఎంపికైన కవి జూకంటిని సన్మానించి రూ.25 వేల నగదు అందజేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డి సినారె విగ్రహం వద్ద నివాళి అర్పించి మాట్లాడారు. మహాకవి సినారె గొప్ప దార్శనికుడు అని, నిండైన తెలుగుదనానికి నిలువెత్తు సాక్ష్యం అని కొనియాడారు. చిత్రకారుడు జె.వి తీర్చిదిద్దిన సినారె తైలవర్ణ చిత్రపటం, డా.సినారె సినీ గీత సర్వస్వం 7వ సంపుటాన్ని మంత్రి ఆవిష్కరించారు. ‘సినారె సినీగీత సర్వస్వం సంపుటాల్లో పాటలసూచీ అనుక్రమణిక’ను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకాధికారి, కవి దేశపతి శ్రీనివాస్‌, శాంతా బయోటెక్నిక్స్‌ సంస్థ అధినేత డా.కె.ఐ.వరప్రసాదరెడ్డి, పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య, మాజీ ఎంపీ, రామచంద్రారెడ్డి, సినారె అల్లుళ్లు భాస్కర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, మంత్రి రామారావు, సినారె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

తెలుగు జాతి సాహితీ సంపద సినారె: శ్రీనివాస్‌గౌడ్‌

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: తెలుగు జాతి సాహితీ సంపద సినారె అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌ గౌడ్‌ కొనియాడారు. గురువారం రవీంద్రభారతి ప్రధాన మందిరంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత డా.సినారె జయంత్యుత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. సినారె సాహిత్యం, ఆయన క్రమశిక్షణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎంతో ప్రభావితం చేశాయన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, తెలంగాణ సంగీత, నాటక అకాడమీ ఛైర్మన్‌ బాదిమి శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని