‘భగీరథ’ అంచనాలు పెరిగాయ్‌!
close
Published : 30/07/2021 04:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘భగీరథ’ అంచనాలు పెరిగాయ్‌!

‘మల్లన్నసాగర్‌’ నీటి తరలింపునకు..రూ.674 కోట్ల నుంచి రూ.1212 కోట్లకు పెంపు
గతంలో అనుమతి పొందిన సంస్థకే అదనపు పనులు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: మిషన్‌ భగీరథ ప్రాజెక్టు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మల్లన్నసాగర్‌ రిజర్వాయరు నుంచి నీటిని తీసుకెళ్లే ఓ పనికి అంచనా వ్యయం ఏకంగా రూ.674 కోట్ల నుంచి రూ.1212 కోట్లకు పెరిగింది. మల్లన్నసాగర్‌ నుంచి జనగాం, గజ్వేల్‌, ఆలేరు-భువనగిరి, మేడ్చల్‌కు తాగునీటిని అందించేందుకు అవసరమైన పైపులైన్‌, ఇన్‌టేక్‌ నిర్మాణాలు, నీటిశుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఓ గుత్తేదారు సంస్థకు రూ.674 కోట్లతో పనులు అప్పగించింది. అయితే.. ప్రభుత్వం తాజాగా ఈ పనుల అంచనాలను రూ.1212 కోట్లుగా సవరించింది. గతంలో ఎంపికైన గుత్తేదారు సంస్థ అప్పట్లో అనుమతి పొందిన పనులతో పాటు అదనపు పనులు చేపట్టేందుకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి. ఈ మేరకు మిషన్‌ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది జనవరిలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ.674 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం గుత్తేదారు సంస్థకు అనుమతి ఇచ్చింది. తాజాగా అంచనాలు భారీగా పెరగడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ పరిధి కింద మల్లన్నసాగర్‌ నుంచి జనగామ, గజ్వేల్‌, ఆలేరు-భువనగిరి, మేడ్చల్‌ ప్రాంతాలకు నీటిని తరలించే పనుల అంచనాలను రూ.674 కోట్ల నుంచి రూ.1212 కోట్లకు సవరిస్తూ మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ ప్రభుత్వానికి లేఖ రాశారు. గతంలో మంజూరైన పనులతోపాటు అదనపు పనులు కూడా ఆ గుత్తేదారు సంస్థే చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం అంచనా వ్యయం పెంచడంతోపాటు ఆ సంస్థే అదనపు పనులను చేపట్టడానికి అనుమతులు మంజూరు చేసింది. తొలుత అనుమతించిన ప్రాజెక్టు వ్యయం రూ.674 కోట్లలో రూ.572.90 కోట్లు నాబార్డు రుణం కింద మంజూరయ్యాయి. మిగతా రూ.101.10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటా. తాజాగా సవరించిన అంచనాలతో ప్రభుత్వ వాటా రూ.639.10 కోట్లకు పెరిగింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని