త్వరలో కృష్ణా బోర్డు సమావేశం!
close
Published : 30/07/2021 04:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలో కృష్ణా బోర్డు సమావేశం!

నీటి కేటాయింపులపై చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపులపై చర్చించేందుకు కొద్ది రోజుల్లో కృష్ణాబోర్డు సమావేశం కానున్నట్లు తెలిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల కింద ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సాగు, తాగు అవసరాలకు నీటి కేటాయింపులపై చర్చించనుంది. చెన్నై తాగునీటి అవసరాలు, ఏపీలోని వివిధ ప్రాజెక్టులకు 27 టీఎంసీలు అవసరమని ఏపీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఇప్పటికే బోర్డుకు లేఖ రాశారు. తెలంగాణ కూడా శ్రీశైలం, జూరాల, సాగర్‌లతోపాటు కల్వకుర్తి, దేవాదుల తదితర ఎత్తిపోతల కింద నీటి కేటాయింపుల కోసం బోర్డుకు విన్నవించేందుకు కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. బోర్డు పరిధిని నిర్ధారిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ అమలుపైనా చర్చించేందుకు కృష్ణాబోర్డు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. గెజిట్‌ను నోటిఫై చేసేందుకు కేంద్రం ఇచ్చిన 30 రోజుల గడువులో ఇప్పటికే 15 రోజులు పూర్తయ్యాయి. దీంతో వచ్చే బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించేందుకు విధానాలను రూపొందిస్తున్నారు. ప్రాజెక్టుల నిర్వహణ, సిబ్బంది కేటాయింపులు ఏ విధంగా పూర్తి చేయాలనేదానిపై చర్చించనున్నట్లు సమాచారం. 

* శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాన్ని గురువారం తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సందర్శించారు. విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న ఐదు యూనిట్లను పరిశీలించారు. దెబ్బతిన్న యూనిట్లకు అతి తక్కువ ఖర్చుతో మరమ్మతులు పూర్తి చేసిన జెన్‌కో సిబ్బందిని అభినందించారు. నాలుగో యూనిట్‌ మరమ్మతులను త్వరగా పూర్తి చేసి ఉత్పత్తికి సిద్ధం చేయాలని సూచించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని