కొవాగ్జిన్‌ టీకాతో డెల్టా ప్లస్‌కు అడ్డుకట్ట
close
Updated : 03/08/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవాగ్జిన్‌ టీకాతో డెల్టా ప్లస్‌కు అడ్డుకట్ట

హైదరాబాద్‌: కొవిడ్‌-19 వ్యాధికి భారత్‌ బయోటెక్‌ ఆవిష్కరించిన కొవాగ్జిన్‌ టీకా (బీబీవీ152) డెల్టా ప్లస్‌ (ఏవై-1) రకం కరోనా వైరస్‌పై సమర్థంగా పనిచేస్తుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. ‘బయోరిగ్జివ్‌’ అనే సైన్సు వెబ్‌సైట్‌ ఈ మేరకు ఒక వ్యాసాన్ని ప్రచురించింది. డెల్టా, డెల్టా ఏవై-1, బి.1.617.3 రకం వైరస్‌లపై దీని పరీక్షించినప్పుడు సానుకూల ఫలితాలు వచ్చాయి- అని ఈ అధ్యయనం పేర్కొంది. ఐసీఎంఆర్‌ కూడా ఈ మేరకు ట్వీట్‌ చేసింది. డెల్టా రకం వైరస్‌ కారణంగానే దేశంలో రెండో దశలో కరోనా ఉద్ధృతమయింది. అది మళ్లీ మార్పులు పొంది డెల్టా ప్లస్‌గా రూపాంతరం చెందింది. దీనిని కొవాగ్జిన్‌ సమర్థంగా అణచివేసినట్టు ఐసీఎంఆర్‌ తెలిపింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని