అక్టోబరు 25 నుంచి ఇంటర్‌ ప్రథమ పరీక్షలు
close
Updated : 25/09/2021 05:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్టోబరు 25 నుంచి ఇంటర్‌ ప్రథమ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు అక్టోబరు 25వ తేదీ నుంచి జరగనున్నాయి. 2020-21 విద్యాసంవత్సరం ఇంటర్‌ ప్రథమ విద్యార్థులు ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే వారంతా ప్రమోట్‌ అయ్యారు. పరిస్థితులు అనుకూలించిన తరవాత మొదటి సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు అధికారులు గతంలోనే స్పష్టం చేశారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల టైం టేబుల్‌ను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శుక్రవారం విడుదల చేశారు. తొలుత ప్రకటించిన విధంగా 70 శాతం సిలబస్‌కే పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

మాస్కు తప్పనిసరి

విద్యార్థులు, సిబ్బంది మాస్కును తప్పనిసరిగా ధరించి పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించాలని, భౌతికదూరం పాటించాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. కొవిడ్‌ నిబంధనల మధ్య పరీక్షలు నిర్వహిస్తారు. టీకా వేయించుకున్న వారినే విధుల్లో నియమిస్తారు. బెంచీలు, డెస్కులు, తలుపులు, కిటికీలను శానిటైజ్‌ చేస్తారు. ప్రతీ కేంద్రంలో ఒకట్రెండు ఐసొలేషన్‌ గదుల్ని ఏర్పాటు చేయనున్నారు. ఒక స్టాఫ్‌ నర్సు గానీ ఏఎన్‌ఎం గానీ అందుబాటులో ఉంచుతారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని