Cyclone Gulab: ఏపీలో ఆరు జిల్లాలు అతలాకుతలం
close
Updated : 28/09/2021 05:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cyclone Gulab: ఏపీలో ఆరు జిల్లాలు అతలాకుతలం

ఈనాడు- అమరావతి, విశాఖపట్నం: గులాబ్‌ తుపాను ఏపీలో శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు ఆరు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. తుపాను ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకుంటుండగా ఆదివారం అర్ధరాత్రి నుంచే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ పలుచోట్ల కుంభవృష్టి కురిసింది. మొత్తం 277 మండలాల్లోనూ వానలు పడ్డాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 98 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడ్డాయి. గంటకు 60 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఉత్తరాంధ్రలో వేల సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు, విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. నదుల్లో ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. రోడ్లు, వంతెనల మీదుగా నీరు పారడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లతోపాటు విద్యుత్తు సబ్‌స్టేషన్లు, పోలీస్‌స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వాసుపత్రుల్లోకి వరద నీరు చేరింది. తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. వరద ముంచెత్తడంతో విశాఖపట్నంలో వాహనాలు నీటమునిగాయి.

విమాన సర్వీసులు ఆలస్యం
గులాబ్‌ తుపానుతో వాతావరణ మార్పుల కారణంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించక 7.20 గంటల బెంగళూరు ఇండిగో సర్వీసు సుమారు గంటన్నరపాటు గాల్లో చక్కర్లు కొట్టింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని