CINEMA: చలనచిత్ర పరిశ్రమకు అండగా ప్రభుత్వం
close
Updated : 23/05/2021 10:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CINEMA: చలనచిత్ర పరిశ్రమకు అండగా ప్రభుత్వం

సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చలనచిత్ర పరిశ్రమకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. శనివారం తెలుగు సినీ పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు అనిల్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి  పీఎస్‌ఎన్‌ దొర, చిత్రపురి కాలనీ కార్యదర్శి కాదంబరి కిరణ్‌కుమార్‌ తదితరులు మంత్రిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తమ సమస్యలను వివరించారు. గత సంవత్సరం కరోనా సమయంలో ప్రభుత్వం తమను ఆదుకుందని కృతజ్ఞతలు తెలిపారు. రెండోదశలో లాక్‌డౌన్‌తో షూటింగులు నిలిచిపోయి కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, మరోసారి తమను ఆదుకోవాలని కోరారు. కార్మికులకు కరోనా టీకాలు వేయించాలని అభ్యర్థించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేస్తుందని, అందరూ దీనికి సహకరించాలని కోరారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని