Supreme Court: హైకోర్టులో విచారణకు అనుమతించండి
close
Updated : 14/07/2021 08:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Supreme Court: హైకోర్టులో విచారణకు అనుమతించండి

విచారణను 22కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ఈనాడు, దిల్లీ: ఏపీ రాజధాని భూముల కేసులో సిట్‌ విచారణపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దుచేయాలని, ఆ కేసులో దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో విచారణను ఈ నెల 22కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో విచారణ దాదాపు నిలిచిపోయినందున దీన్ని హైకోర్టుకు తిప్పి పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఏకీభవించలేదు. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ వాదిస్తూ... హైకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాస్‌ వేసిన వ్యాజ్యం ప్రతీకారంతో వేసినదేనని అన్నారు. రెండు పార్టీలూ కేసును ఇక్కడే విచారించేందుకు అంగీకరిస్తే.. కోర్టు తన నిర్ణయం తీసుకుంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ధర్మాసనం జులై 22కు వాయిదా వేసింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని