covid: పడకలున్నాయ్‌!
close
Updated : 30/05/2021 09:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

covid: పడకలున్నాయ్‌!

ఆస్పత్రులకు తగ్గిన రద్దీ

ఈనాడు, అమరావతి

విజయవాడ జీజీహెచ్‌లో 10 రోజుల కిందట వరకు పరిస్థితి ఇది. జిల్లా నుంచే కాదు.. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు అంబులెన్సులోనే నిరీక్షించేవారు. ఎవరైనా మరణిస్తే ఆ పడక ఇతరులకు కేటాయించే వారు. ఆసుపత్రుల్లో చేరిన వారే కానీ కోలుకుని ఇంటికి వెళ్లే వారు కనిపించేవారు కాదు. క్రమంగా ఆ పరిస్థితి మారింది. పడకలు దొరుకుతున్నాయి. జిల్లాలో ఐసీయూతో సహా ఆక్సిజన్‌, నాన్‌ ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఎక్కువ మంది చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు వైరస్‌ ఉద్ధృతి కొంత తగ్గినట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో పాజిటివిటీ కూడా కొంత తగ్గింది. జీజీహెచ్‌లో పడకలు మాత్రమే కొంచెం నిండుగానే ఉన్నాయి. ప్రస్తుతం 67 బ్లాక్‌ఫంగస్‌ కేసులు వచ్చాయి. వీరికి ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. జీజీహెచ్‌కు అనుబంధంగా.. వెన్యూలో సుజనా ఫౌండేషన్‌ సహకారంతో 100 ఐసీయూ పడకలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రస్తుతం రోగులను చేర్చలేదు. ట్రైయాజ్‌ సెంటర్లకు తాకిడి లేదు. ఇక కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 3036 పడకలకు గాను 2820 ఖాళీగానే ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వీటిని ఉపయోగించుకోవచ్ఛు ప్రస్తుతం ఆక్సిజన్‌ వినియోగం తగ్గింది. అయినా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు 15 రోజుల కిందట పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి తెరలేపాయి. మందుల మాఫియా తెరమీదకు వచ్చింది. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను రూ.35వేలకు విక్రయించడమే కాకుండా నకిలీ మందులు అంటగట్టారు. పోలీసులు దాడులు చేసి రెండు, మూడు ముఠాలను పట్టుకున్నారు. ప్రస్తుతం రెమ్‌డెసివిర్‌ అందుబాటులో ఉందని ఔషధనియంత్రణ శాఖ అధికారులు చెబుతున్నారు.

 


 

స్వీయ నియంత్రణే రక్ష

- ఏఎండీ ఇంతియాజ్‌, కలెక్టర్‌

కొత్తగా వచ్చే కేసుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టింది. కొంత ఉద్ధృతి తగ్గినట్లు తెలుస్తోంది. అయినా అధికార యంత్రాంగం అప్రమత్తంగానే ఉంది. జూన్‌ నుంచి ఇంకా మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయితే బ్లాక్‌ఫంగస్‌ కేసులు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. వాటి మీద దృష్టి పెడుతున్నాం. చికిత్స అందిస్తున్నాం. మందులు అందుబాటులో ఉన్నాయి. కేసులు పెరగకుండా కట్టడికి అధికార యంత్రాంగం కర్ఫ్యూ గట్టిగా అమలు చేస్తోంది. సడలింపు సమయాల్లో ఎక్కువ మంది రోడ్లమీదకు వస్తున్నారు. దీన్ని నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీసు, మున్సిపల్‌ శాఖలతో సమీక్షించాం. కొన్ని మార్కెట్లు మూసేయాలని సూచిస్తున్నాం. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడం ముఖ్యం. గ్రామీణ ప్రాంతాల్లోనూ కొవిడ్‌ కేర్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేశాం. దీంతో జీజీహెచ్‌పై ఒత్తిడి తగ్గింది.


ఆక్సిజన్‌ వినియోగం

ప్రభుత్వ ఆసుపత్రులు: 9

ఆరోగ్యశ్రీ : 37

నాన్‌ ఆరోగ్యశ్రీ: 33

మొత్తం : 79

27 98 85

28 91 82

29 86.5 68


నిల్వ పడకలు ఇలా..! వినియోగం (టన్నుల్లో)

ఐసీయూ 803 22 22 15

ఆక్పిజన్‌ 2305 204 111 104

నాన్‌ ఆక్సిజన్‌ 1935 836 763 620

కొవిడ్‌కేర్‌ సెంటర్లు 3036 2847 2847 2820 కేటగిరీ మొత్తం


 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని