జల నిధుల కోసం దళపతుల నిరసన
close
Published : 30/07/2021 06:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జల నిధుల కోసం దళపతుల నిరసన


మహాత్ముని విగ్రహం వద్ద మాట్లాడుతున్న కుమారస్వామి

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడేే : మేకెదాటు, ఎగువ కృష్ణ, మహదాయి ప్రాజెక్టులకు కేంద్రం తక్షణమే నిధులు విడుదల చేయాలని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి డిమాండు చేశారు. విధానసౌధ ఆవరణలోని మహాత్ముని విగ్రహం వద్ద పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలిసి గురువారం నిరసనకు దిగారు. ధర్నా అనంతరం రాజ్‌భవన్‌కు పాదయాత్రగా వెళ్లి, గవర్నర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో తాగు, సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకునేందుకు కేంద్రం ఎటువంటి వివక్ష చూపకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. తమిళనాడు ఎక్కువ నీటిని వినియోగించుకునేందుకు కేంద్రం అవకాశం ఇచ్చిందని, మహదాయి పథకానికి సంబంధించి ప్రాధికార ఇచ్చిన తీర్పును గెజెట్‌లో ప్రచురించేందుకు మీనమేషాల్ని లెక్కించడం సరికాదని అభ్యంతరం తెలిపారు. ఎగువ కృష్ణ ప్రాజెక్టు నుంచి కర్ణాటక 130 టీఎంసీల నీటిని ఉపయోగించుకునేందుకు అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో రిట్‌ అర్జీ దాఖలు చేయడాన్ని గుర్తు చేశారు. గతంలో జలవనరుల మంత్రిగా సేవలు అందించిన ముఖ్యమంత్రి బొమ్మైకు ఈ సమస్యల గురించి అవగాహన ఉందన్నారు. కేంద్రం స్పందించకపోతే మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ నేతృత్వంలో ఉద్యమిస్తామని ప్రకటించారు.

గవర్నరుతో చర్చలు..

నీటిపారుదల పథకాలకు కేంద్రం తక్షణమే నిధులు విడుదల చేయాలంటూ గవర్నరు థావర్‌ చంద్‌ గహ్లోత్‌కు జనతాదళ్‌ నేతలు విన్నవించారు. గాంధీ విగ్రహం వద్ద ఆందోళన అనంతరం దళపతులు నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుని రాష్ట్రపతి, ప్రధానమంత్రికి గవర్నరు ద్వారా వినతిపత్రాలను పంపించారు. రాష్ట్రానికి చెందిన నీటి పారుదల పథకాల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తప్పుపట్టారు. తమిళనాడు ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగి మేకెదాటుకు అనుమతులు మంజూరు చేయడం లేదన్నారు.

గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న దళపతులు


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని