రూ.55 వేల కోట్లతో 37 రైల్వే ప్రాజెక్టులు
close
Published : 30/07/2021 06:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.55 వేల కోట్లతో 37 రైల్వే ప్రాజెక్టులు

లోక్‌సభలో వెల్లడించిన మంత్రి అశ్వినీ వైష్ణవ్‌


సింగ్‌పూర్‌ రోడ్‌-కొరాపుట్‌ మధ్య ఆరంభ దశలో డబుల్‌ లైను పనులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రూ.55 వేల కోట్లతో 37 రైల్వే ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ఇందులో భాగంగా 4 వేలకు పైగా కి.మీ. రైలు మార్గం వివిధ ప్రాంతాల్లో నిర్మాణం కానుంది. లోక్‌సభ సమావేశాల్లో బిజద ఎంపీ శర్మిష్ట సెఠి అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బదులిస్తూ ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో రూ.55,219 కోట్లతో 37 రైల్వే ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నట్లు పేర్కొన్న మంత్రి అశ్వినీ 4643 కి.మీ. రైలు మార్గం నిర్మాణం జరగనుందని వెల్లడించారు. వీటికి సంబంధించిన పనులు ప్రణాళిక, ఆమోదం, కార్యాచరణ వంటి వివిధ దశల్లో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చినాటికి రూ.16,903 కోట్ల వ్యయంతో 928 కి.మీ. మేర రైల్వే లైను పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. 11 కొత్త మార్గాలకు సంబంధించి 1,460 కి.మీ. లైనును రూ.20,346 కోట్లతో నిర్మించాల్సి ఉండగా, రూ.3,789 కోట్ల వ్యయంతో 112 కి.మీ. నిర్మాణానికి ఆమోదం లభించినట్లు స్పష్టం చేశారు. 3,024 కి.మీ డబుల్‌ లైను నిర్మాణానికి 25 ప్రాజెక్టుల కోసం రూ.33,418 కోట్లు మంజూరు కాగా రూ.12,930 కోట్లతో 726 కి.మీ నిర్మాణం జరుగుతున్నట్లు ఆయన వివరించారు.

141.07 ఎకరాల సేకరణ..

భాజపా ఎంపీ బసంత పండా అడిగిన మరో ప్రశ్నకు మంత్రి వైష్ణవ్‌ బదులిస్తూ కలహండిలో ఎలక్ట్రిక్‌ లోకో వర్కుషాప్‌ కోసం దాదాపు 328.35 ఎకరాల స్థలం అవసరం కాగా రాష్ట్ర సర్కార్‌ 141.07 ఎకరాలు సమకూర్చినట్లు చెప్పారు. 2017-18 బడ్జెట్‌లో కేటాయించిన ఈ ప్రాజెక్టుకు రూ.186.37 కోట్ల వ్యయాన్ని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏ ప్రాజెక్టు పూర్తి కావాలన్నా స్థల సేకరణ, అటవీశాఖ అనుమతులు, వివిధ శాఖల క్లియరెన్స్‌, భౌగోళిక స్థితిగతులు, శాంతిభద్రతలు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. 2019-20లో రాష్ట్రానికి రూ.4,568 కోట్లను కేటాయించిన రైల్వే 2020-21లో రూ.5,296 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,995 కోట్లను కేటాయించిన విషయం విదితమే.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని