ఊపిరి బిగబట్టాల్సిందే
close
Published : 21/09/2021 02:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊపిరి బిగబట్టాల్సిందే

ఏఎంసీలో కొరవడిన సౌకర్యాలు

పని చేయని ఏసీలు

న్యూస్‌టుడే-కర్నూలు వైద్యాలయం : నగరంలోని సర్వజన వైద్యశాలకు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు చెందినవారితో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి రోగులు పెద్దఎత్తున వస్తుంటారు. నిత్యం 2,500 నుంచి 3 వేల వరకు ఓపీ ఉంటుంది. ‘చివరి’దశలో ఉన్న వారు ఏఎంసీ (అక్యూట్‌ మెడికల్‌ కేర్‌ యూనిట్‌) విభాగంలో చేరుతుంటారు. ప్రమాదాల బారిన పడ్డవారికి, పక్షవాతం, కాలేయం, పాము కాటుకు గురైనవారు, కోమాలో వెళ్లినవారికి ఇక్కడ చికిత్స అందిస్తారు. ఈ వార్డులో పూర్తిస్థాయిలో వైద్యం అందడం లేదన్న విమర్శలున్నాయి. ఔషధాలు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఏసీలు పనిచేయకపోవడం, మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు.

అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఈశ్వరప్ప (62) నరాల(న్యూరో) సమస్యతో బాధపడుతూ కోమాలోకి వెళ్లారు. ఆయన పడక వద్దనున్న ఏసీ పనిచేయడం లేదు. సహాయకులు టేబుల్‌ ఫ్యాను కొనుగోలు చేసి తీసుకొచ్చారు. సరైన వసతులు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు.

24 గంటలూ సేవలందించాలి

ఏఎంసీలో 24 గంటలపాటు వైద్యసేవలు అందించాలి. ఈ విభాగం సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేయాలి. జనరల్‌ మెడిసిన్‌, అనస్థీషియా, పీజీలు, హౌస్‌సర్జన్లు అందుబాటులో ఉండాలి. వీరిని పర్యవేక్షణ చేసేందుకు ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ఉంటారు. ప్రతి షిఫ్టునకు ఇద్దరు పీజీలు, నలుగురు హౌస్‌సర్జన్లు, 9 మంది నర్సింగ్‌ సిబ్బంది, అనస్థీషియా పీజీలు పనిచేస్తుంటారు. 30 మెడిసిన్‌ బెడ్లు, 6 సర్జికల్‌ బెడ్లు ఉన్నాయి. ఇక్కడ సింహభాగం రోగులకు వెంటిలేటర్లపై చికిత్స అందిస్తుంటారు.

 

కొరవడిన పర్యవేణ

అక్యూట్‌ మెడికల్‌ కేర్‌ యూనిట్‌పై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఇక్కడ కొన్ని ఏసీలు నాలుగు నెలలుగా పనిచేయకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. మరుగుదొడ్లు అందుబాటులో లేక నెల రోజులు దాటినా పట్టించుకునేవారే కరవయ్యారు. సుమారు 60 రకాల మందులు అవసరమైతే కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ నిపుణులైన వైద్యుల సేవలు ఎంతో అవసరమున్నా పీజీలే విధులు నిర్వహించాల్సి వస్తోంది. రాత్రివేళల్లో కొందరు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సేవలు అందించేందుకు సహాయకులు అల్లాడుతున్నారు. ఉన్నతాధికారులు దీనిపై స్పందించాల్సి ఉంది.

తాడిపత్రికి చెందిన మగ్బుల్‌బాషా (55) కాలుకు ఇన్ఫెక్షన్‌ సోకి వారం కిందట ఏఎంసీ వార్డులో చేరారు. పడక వద్ద ఏసీ పనిచేయలేదు. పంకా తిరగకపోవడంతో ఉక్కపోత తట్టుకోలేక రూ.2 వేలు వెచ్చించి కొత్తది తెచ్చుకొన్నారు. మరుగుదొడ్లు పనిచేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అవసరమైన ఔషధాలూ బయటనే కొనుగోలు చేస్తున్నారు.

మరమ్మతులకు ప్రతిపాదనలు : డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి, ఆస్పత్రి పర్యవేక్షకులు

ఏఎంసీలో ఏసీలు, మరుగుదొడ్ల సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకుగాను ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులకు అంచనాలు పంపాం. త్వరలో దీనిని పరిష్కరిస్తాం. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారిని చివరి క్షణంలో ఏఎంసీలో చేర్పిస్తున్నారు. ఫలితంగా మరణాలు ఎక్కువగా ఉంటాయి. మెరుగైన వైద్యంతో చాలామంది ఆరోగ్యంగా ఇళ్లకు వెళ్లినవారు ఎక్కువగా ఉన్నారు. మందుల సమస్య లేదు.

నెలకు రెండువందల మంది

ఏఎంసీలో నిత్యం పది మందికిపైగా చేరుతున్నారు. వీరంతా ప్రాణాప్రాయస్థితిలో ఉన్న వారే. ఆగస్టులో 224 మంది చనిపోయారు


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని