సర్దుకుపోతే ..స్వీటు మనకే !
close
Updated : 21/09/2021 06:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సర్దుకుపోతే ..స్వీటు మనకే !

పరస్పర అవగాహనతో తెదేపా-జనసేన అడుగులు

 ఎంపీపీ పీఠాల కైవసానికి కొన్నింట వ్యూహం


పి.గన్నవరం మండల పరిషత్‌ కార్యాలయం 

ఈనాడు, కాకినాడ -న్యూస్‌టుడే,  పి.గన్నవరం, రాజోలు, కడియం, ఆలవ΄రు, మారేడుమిల్లి :  పరిషత్‌ ఫలితం తేలింది. జడ్పీ ఛైర్మన్‌.. జడ్పీటీసీ సభ్యులు.. ఎంపీపీలు పీఠాలను అధిరోహించడమే తరువాయి. జిల్లా యంత్రాంగం ఇందుకు కసరత్తు చేస్తోంది. అధిక స్థానాలను దక్కించుకున్న అధికార పక్షం.. జడ్పీఛైర్మన్‌ ఎవరో స్పష్టత ఇవ్వగా.. ఎంపీపీల ఎంపికపైనా కసరత్తు ప్రారంభించింది. అయితే.. ఎన్నికలను తెదేపా బహిష్కరించినా.. స్థానిక  నాయకులు- జనసేనతో అవగాహన మేరకు కొన్నిచోట్ల పోటీచేసి ఎంపీటీసీ స్థానాలు దక్కించుకున్నారు. ఆయాచోట్ల పరస్పర అవగాహనతో పరిషత్‌ పీఠం అధిరోహించడానికి సిద్ధం అవుతున్నారు. శిబిర రాజకీయాలు.. అంతర్గత సమావేశాలతో అధికార పక్షానికి వ్యతిరేక వ్యూహాలతో రాజకీయాలను వేడిపుట్టిస్తున్నారు.

జిల్లాలో పెద్దాపురం మండలం పులిమేరు, మారేడుమిల్లి మండలంలోని దొరచింతలపాలెం ఎంపీటీసీ స్థానాలపై ఎన్నికల సంఘం నుంచి దిశానిర్దేశం కోసం ఎదురుచూస్తున్నారు. జడ్పీటీసీ స్థానాల్లో వైకాపా 59.. తెదేపా, జనసేన ఒక్కొక్కటి చొప్పున దక్కించుకున్నాయి. ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా 764, తెదేపా 110, జనసేన 93, స్వతంత్రులు 19, సీపీఎం ఏడు, భాజపా రెండు.. కాంగ్రెస్, 
బీఎస్పీలు ఒక్కొక్క స్థానంలో నెగ్గాయి. ఫలితాల ప్రకటన పూర్తవడంతో పీఠాల ఎంపికపై ఆసక్తి నెలకొంది.

పి.గన్నవరం : చెరో రెండున్నరేళ్లు..

పి.గన్నవరం మండలంలో తెదేపా- జనసేన చెరో రెండున్నరేళ్లు ఎంపీపీ పీఠం దక్కించుకోడానికి అవగాహన కుదుర్చుకున్నాయి. మొత్తం 22 ఎంపీటీసీ స్థానాలు ఉంటే.. నామినేషన్ల సమయంలోనే అన్నిచోట్ల పోటీచేయకుండా తెదేపా- జనసేన బలం ఉన్నచోట పోటీకి దిగాయి. బహుజన్‌ సమాజ్‌పార్టీకి కొన్ని స్థానాలు వదిలేశారు. దీంతో తెదేపాకు ఏడు, జనసేన అయిదు, జనసేన- తెదేపా మద్దతు ఇచ్చిన బీఎస్పీకి ఒక ఎంపీటీసీ స్థానం దక్కింది. ఒంటరిగా పోటీ చేసిన వైకాపాకు తొమ్మిది ఎంపీటీసీలు వచ్చాయి. కూటమికి 13 స్థానాలు దక్కడంతో దీంతో మండల పరిషత్తు వైకాపాకు దక్కే అవకాశం లేకుండా పోయింది. ఎంపీపీగా ముంగండ-2 ఎంపీటీసీ తెదేపా అభ్యర్థి అంబటి భూలక్ష్మి పేరు వినిపిస్తోంది. జనసేన నుంచి రెండున్నరేళ్ల తర్వాత ఎవరన్నది తేలే పరిస్థితి కనిపిస్తోంది. తెదేపా- జనసేన ఎవరికివారు వేర్వేరుగా ఇప్పటికే సమావేశాలు ఏర్పాటుచేసుకున్నారు. 

ఆలమూరు : వీడని ఉత్కంఠ

ఆలమూరు మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలు ఉంటే.. వైకాపా 11, జనసేన ఎనిమిది, తెదేపా రెండు దక్కించుకున్నాయి. జొన్నాడ స్థానం నుంచి గెలిచిన వైకాపా అభ్యర్థి కోమలి దుర్గ ఫలితాలు రాకముందే మరణించారు. దీంతో వైకాపా 10, తెదేపా- జనసేన బలం పది  స్థానాలతో సమమైంది. దీంతో ఎంపీపీ పీఠం ఎవరు దక్కించుకుంటారనే అంశంపై స్థానికంగా ఉత్కంఠ  నెలకొంది.

మలికిపురం

మలికిపురం మండలంలో 22 ఎంపీటీసీ స్థానాలు ఉంటే.. రెండు ఏకగ్రీవంతో వైకాపా, జనసేన చెరొకటి దక్కించుకున్నారు. ఇద్దరు అభ్యర్థుల మృతితో రెండుచోట్ల ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగి ఫలితాలొచ్చిన 18 స్థానాల్లో.. వైకాపాకు తొమ్మిది, తెదేపాకు 5, జనసేన నాలుగు చొప్పున దక్కించుకున్నాయి. దీంతో వైకాపా పది, తెదేపా- జనసేన కలిస్తే పది స్థానాల బలం ఉంటుంది. తెదేపా, జనసేన మధ్య పొత్తు అంశం చర్చనీయాంశమైంది. మొత్తంగా పీఠం ఎవరిని వరిస్తుందో చూడాల్సిందే.

కూనవరం

కూనవరం: మండలంలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు వైకాపా నాలుగు, సీపీఎం వ΄డు, స్థానిక మిత్రపక్షం జనసేన ఒకచోట గెలిచాయి. దీంతో చెరో నాలుగు స్థానాలు రావడంతో ఎంపీపీ ఎవరనేది స్పష్టత కొరవడింది. అధికారులు లాటరీ వేస్తారా.. చెరో రెండున్నర ఏళ్లు పీఠాన్ని పంచుకునేందుకు ఆ రెండు పార్టీలు అంగీకరిస్తాయా అనేది తేలాల్సి ఉంది. 

కడియం : అల.. శిబిర రాజకీయాల్లో..

కడియం మండలంలో 22 ఎంపీటీసీ స్థానాలు ఉంటే.. వీటిలో వైకాపా, జనసేనకు ఒక్కోటి ఏకగ్రీవం అయ్యాయి. జనసేన ఏకగ్రీవ అభ్యర్థిని నూనె విజయనిర్మల కరోనాతో ఇటీవల మృతిచెందారు. ఎన్నిక జరిగిన 20 స్థానాల్లో వైకాపా, జనసేన ఎనిమిదేసి చొప్పున.. తెదేపా 4 గెలిచాయి. వైకాపా బలం తొమ్మిది, జనసేన- తెదేపా బలం 12కు చేరింది. దీంతో పొత్తుల వ్యూహం కొనసాగుతోంది. రాజమహేంద్రవరంలో తెదేపా- జనసేన అభ్యర్థులు ప్రత్యేక శిబిరంలో ఉన్నారు. తెదేపా కడియం-2 విజేత  సత్యప్రసాద్‌ను ఎంపీపీ అభ్యర్థిగా నిలపాలని తెదేపా- జనసేన అవగాహనతో ఉన్నాయి. ఈయన ఆధ్వర్యంలో శిబిరం నడుస్తోంది.

మారేడుమిల్లి : ఆ ఒక్కటీ. తేలితేనే.. 

మారేడుమిల్లి జడ్పీటీసీ  ఫలితంపై ఎన్నికల సంఘం ఆదేశాలతో స్పష్టత వచ్చినా.. ఎంపీపీ పీఠంపై మాత్రం ఉత్కంఠ వీడలేదు. ఆరు ఎంపీటీసీ స్థానాలు ఉంటే.. ఆదివారం రాత్రి అయిదింటి ఫలితాలు ప్రకటించారు. వీటిలో వైకాపా వ΄డు, తెదేపా రెండు స్థానాల్లో విజయం సాధించింది. దొరచింతలపాలెం ఎంపీటీసీ స్థానంలో రెండువేల పైచిలుకున్న బ్యాలెట్‌ పెట్టెల్లో ఓట్లు తడిసి లెక్కింపు తాత్కాలికంగా నిలిచింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టనున్నారు. ఒకవేళ లెక్కింపు జరిగితే.. పరిస్థితి ఎలా ఉంటుంది..? ఎన్నిక మళ్లీ అనివార్యమైతే ఫలితం ఎవరిని వరిస్తుంది..? అనే దానిపైనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఈ సందిగ్ధంలో ఉన్న స్థానం వైకాపాకు దక్కితే ఎంపీపీ పీఠం వారికే దక్కుతుంది. ఒకవేళ తెదేపా విజయం సాధిస్తే స్థాన బలాలు సమానం అవుతాయి. ప్రస్తుతానికి సందిగ్ధం నెలకొంది.

అధికార పక్షానికి కష్టమే

రాజోలు మండలంలో 20 స్థానాలుంటే.. తెదేపా ఎనిమిది, జనసేన, వైకాపా అయిదేసి చొప్పున దక్కించుకున్నాయి. స్వతంత్రులకు రెండు దక్కాయి. దీంతో ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. తెదేపా- జనసేన కలిస్తే.. స్వతంత్రుల ఓట్లు అధికార పక్షానికి అనుకూలంగా మారినా పీఠం వైకాపా దక్కించుకోవడం కష్టమే. తెదేపా-జనసేన కలిసి పీఠం దక్కిOచుకునేలా పావులు కదుపుతున్నాయి.  


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని