విద్యాసామర్థ్యాల పెంపుపై దృష్తి
close
Published : 21/09/2021 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యాసామర్థ్యాల పెంపుపై దృష్తి

లక్ష్య సాధనకు 40 రోజుల ప్రణాళిక

న్యూస్‌టుడే, బేల


సిర్సన్న ఉన్నత పాఠశాలలో ప్రారంభ పరీక్ష రాస్తున్న విద్యార్థులు

చదవడం, రాయడం వంటివి నేర్పించడం వల్ల మిగతా సబ్జెక్టుల బోధనకు ఆటంకం ఉండదు. గతంలో చేపట్టిన అభ్యసనాభివృద్ధి, త్రీ ఆర్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 40 రోజుల ప్రణాళికలో విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు చాలా అవకాశాలున్నాయి. రోజువారీగా జరిగే పాఠ్యాంశ బోధనకు ఆటంకం లేకుండా పాఠశాలలో ఉపాధ్యాయులందరూ సమష్టి బాధ్యత వహించి సమర్థంగా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సముదాయి, మండల, జిల్లా స్థాయిలోని పర్యవేక్షణ అధికారులు ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు చేపట్టిన కార్యక్రమం ఎలా అమలవుతుందో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తే ఫలితం ఉంటుంది.

జిల్లాలోని పాఠశాలల విద్యార్థులు చతుర్విద ప్రక్రియల్లో సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు ప్రత్యేకంగా అభ్యాసనాభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 718 పాఠశాలలుండగా 40 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. సోమవారం మూడో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రారంభ పరీక్ష నిర్వహించారు. మార్కుల ఆధారంగా వారి సామర్థ్యాల సాధనకు 40 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. మధ్యాహ్నం చివరి రెండు పీరియడ్లు విద్యార్థులను గ్రూపులుగా విభజించి చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు తదితర వాటిని నేర్పిస్తారు. రెగ్యులర్‌ పీరియడ్లను నష్టం చేకూర్చకుండా ఈ అభ్యాసనాభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేసేలా కార్యచరణ రూపొందించారు.

చదవడం, రాయడం, లెక్కలు చేయడం (రీడింగ్‌, రైటింగ్‌, అర్థమెటిక్‌)ను పాఠశాల పరిభాషలో 3ఆర్‌గా సంక్షిప్తంగా పిలుస్తున్నారు. ఇవి ప్రతి విద్యార్థి సాధించాల్సిన కనీస సామర్థ్యాలు. దీని కోసం ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఒక కార్యాచరణ రూపొందిస్తారు. విద్యార్థుల స్థాయిని ఆధారంగా సామర్థ్యాలు ఉన్న వారు, లేని వారు అనే రెండు విభాగాలను ఏర్పాటు చేస్తారు.

రెండు విభాగాల్లో ప్రతి పీరియడ్‌లో తెలుగు, ఆంగ్ల, గణితం మార్చిమార్చి వచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తారు.

* ఉపాధ్యాయుల సంఖ్య బట్టి ఒక్కో గ్రూపునకు ఒక్కో ఉపాధ్యాయులు వచ్చేలా కాల నిర్ణయ పట్టిక రూపొందించాలి.


సమర్థంగా అమలు చేస్తే ఫలితాలు

చదవడం.. రాయడం.. లెక్కలు చేయడం.. ఇవి ప్రతి విద్యార్థికీ ఉండాల్సిన కనీస సామర్థ్యాలు. కరోనా దెబ్బతో ఏడాదిన్నరగా పాఠశాలలు మూతపడి వారిలో ఇవి దిగజారాయి. ప్రత్యక్ష బోధన ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు ఏబీసీ(త్రీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని విద్యాశాఖ రూపొందించింది. అక్టోబరు 31 వరకు ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. క్షేత్ర స్థాయిలో దీన్ని పటిష్ఠంగా అమలు చేస్తే లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది.


పకడ్బందీగా అమలు చేస్తాం

ప్రణీత, జిల్లా విద్యాధికారి

విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల అనుగుణంగా జిల్లాలో అభ్యసనాభివృద్ధి కార్యక్రమం పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. దీనికి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పూర్తి బాధ్యత వహించాలి. 40 రోజుల ప్రణాళిక తర్వాత అందరూ అన్ని సామర్థ్యాలు సాధించేలా చర్యలు దృష్టి సారించాం. మండల స్థాయిలో పాఠశాల సముదాయి ఛైర్మన్లు, ఎంఈఓలు, జిల్లా స్థాయిలో అధికారుల బృందం కలిసి కార్యక్రమ అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని